నవీముంబై మేయర్‌గా ఎన్సీపీ అభ్యర్థి సుధాకర్ సోనావణే గెలుపొందారు...
ముంబై సెంట్రల్: నవీముంబై మేయర్‌గా ఎన్సీపీ అభ్యర్థి సుధాకర్ సోనావణే గెలుపొందారు. నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ)కు శనివారం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. శివసేన అభ్యర్థి సంజూ వాడ్‌పై 23 ఓట్ల తేడాతో సుధాకర్ గెలుపొందారు. సంజూకు 44 ఓట్లు, సుధాకర్‌కు 67 ఓట్లు వచ్చాయి. కాగా, డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి అవినాశ్ లాడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధిపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
ప్రజా నాయకుడు గణేశ్ నాయిక్ సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకొని పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ అవినాశ్ మాట్లాడుతూ.. పట్టణంలో ఆరోగ్య సేవలను నవీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ మేయర్ అవినాశ్ లాడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణాన్ని మరింత సౌందర్యవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.