సదస్సులో పెట్రోటెక్ యాప్స్‌ను చూపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
• దేశీయంగా చమురు ఉత్పత్తి పెరగాలి
• దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి
• పెట్రోటెక్ సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశీ ఇంధన సంస్థలు బహుళ జాతి కంపెనీలుగా (ఎంఎన్‌సీ) ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆసియాలోని పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాలకు ఎనర్జీ కారిడార్‌లను ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలన్నారు. ‘‘దేశ ఇంధన అవసరాలు పెరుగుతున్నారుు. వాటిని తీర్చేలా భారత కంపెనీలు విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని సూచించారాయన. సోమవారమిక్కడ పెట్రోటెక్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థికాభివృద్ధికి కీలకమైన ఇంధన ధరలు స్థిరంగా, సముచిత స్థారుులో ఉండాలని మోదీ అభిప్రాయపడ్డారు. పెరిగే డిమాండ్‌కి తగ్గట్లుగా దేశీయంగానే చమురు, గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచుకోవాలని, దిగుమతులపై ఆధారపడటం తగ్గాలని ఆయన చెప్పారు. చమురు వినియోగం పెరుగుతున్నప్పటికీ .. 2022 నాటికి దిగుమతులపై ఆధారపడటాన్ని దాదాపు 10 శాతం తగ్గించుకోవాలని నిర్దేశించుకున్నట్లు మోదీ చెప్పారు. ’ఆర్థిక వృద్ధికి ఇంధనమే కీలక చోదకం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరాలంటే ఇంధన ధరలు నిలకడగా, స్థిరంగా, సముచితమైన స్థారుులో ఉండాలి’ అని తెలిపారు.
వృద్ధికి హైడ్రోకార్బన్‌స కీలకం..
దేశ భవిష్యత్‌కు హైడ్రోకార్బన్‌స కీలకమన్న మోదీ 2040 నాటికి మొత్తం యూరప్ కన్నా అధికంగా భారత్‌లో వినియోగం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్.. 2040 నాటికి ఐదు రెట్లు ఎదుగుతుందన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 16 శాతంగా ఉన్న తయారీ రంగం వాటా 2022 నాటికి 25 శాతానికి పెరగనుందన్నారు. గణనీయమైన డిమాండ్ నేపథ్యంలో హైడ్రోకార్బన్‌స రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా.. షేల్ ఆరుుల్, గ్యాస్, కోల్ బెడ్ మీథేన్ మొదలైన ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి ఏకీకృత లెసైన్సు ఇచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బిడ్డర్లు తాము కోరుకున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేట్లు ఓపెన్ ఎక్రేజ్ నిబంధనలు, లాభాల్లో కాకుండా ఆదాయాల్లో వాటాలు, ఉత్పత్తి చేసిన ఇంధనం మార్కెటింగ్.. ధరల విషయంలో స్వేచ్ఛ కల్పించడం తదితర అంశాలు ఇందులో ఉన్నట్లు వివరించారు.
పెట్టుబడులకు అపార అవకాశాలు..
భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఈ సందర్భంగా మోదీ తెలియజేశారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసిన నేపథ్యంలో విదేశీ హైడ్రోకార్బన్ కంపెనీలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆహ్వానించారు. మందగమన పరిస్థితుల్లోనూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థిరంగాను, వేగవంతంగాను వృద్ధి నమోదు చేస్తోందని చెప్పారు. కరెంటు అకౌంటు లోటు దశాబ్దాల కనిష్టానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధిక స్థారుుకి పెరిగాయన్నారు. 2040 నాటికి వాణిజ్య వాహనాల సంఖ్య 1.3 కోట్ల నుంచి 5.6 కోట్లకు చేరనున్నాయని, దీనికి తగినట్లుగా రవాణా మౌలిక సదుపాయాలను అనేక రెట్లు మెరుగుపరుస్తున్నామని మోదీ చెప్పారు. ఇక పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ 2034 నాటికి మూడో స్థానానికి చేరనుందన్నారు. దీంతో విమాన ఇంధనానికి డిమాండ్ నాలుగు రెట్లు పెరగనుందని తెలిపారు.
చమురుకు రెట్టింపు డిమాండ్..
2040 నాటికి భారత్‌లో చమురు డిమాండ్ రెట్టింపు కాగలదని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సనుసీ బర్కిందో చెప్పారు. అప్పటికల్లా రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ)కు పెరగొచ్చన్నారు. 2015లో ఇది రోజుకు సుమారు 4.1 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. క్రూడ్ వినియోగం పెరుగుదలకు రవాణా, పెట్రోకెమికల్ వంటి రంగాలు కారణం కాగలవని బర్కిందో తెలిపారు. ఆరుుల్ మార్కెట్ స్థిరీకరణలో భారత్ కీలకపాత్ర పోషించగలదన్నారు. భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్‌లో 85%, గ్యాస్‌లో 90% ఒపెక్ సభ్య దేశాల నుంచే వస్తోంది.
అధిక రేట్లతో వృద్ధికి విఘాతం..
చమురు రేట్లు అధిక స్థారుులో ఉంటే భారత వృద్ధి గమనంపై ప్రతికూల ప్రభావం పడగలదని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఉత్పత్తిని తగ్గించాలంటూ చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్ నిర్ణరుుంచిన దరిమిలా క్రూడ్ బ్యారెల్ రేటు 50 డాలర్ల మార్కు దాటేసిందని, ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ధరను నిర్ణరుుంచేటప్పుడు డిమాండ్, సరఫరా భద్రతలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.