ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు జనం పోటెత్తుతున్నారు. ప్రతీరోజు ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ.. కొన్ని లక్షలమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న కుంభ స్నానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ ఫిబ్రవరి 5నే మహా కుంభ స్నానానికి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్న అందరిమదిలో మెదులుతోంది.
ఫిబ్రవరి 5.. మాఘ మాసం, గుప్త నవరాత్రి, అష్టమి తిది(ఉత్తరాదిన) రోజున ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానం చేయనున్నారు. ఆరోజున స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో మంచిదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాఘ మాసం అష్టమి రోజున పవిత్ర నదిలో స్నానం చేసి, పూర్వీకులకు నీరు, నువ్వులు, బియ్యం, పండ్లు మొదలైనవి సమర్పించడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలలో పేర్కొన్నారు.
కాగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీజేపీ ఎంపీ రవి కిషన్, ఆధ్యాత్మిక గురువు సద్గురు, నటుడు అనుపమ్ ఖేర్, కుమార్ విశ్వాస్ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించారు.
Comments
Please login to add a commentAdd a comment