
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. దేశ విదేశాల నుండి పర్యాటకులు, భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
మహాకుంభమేళాలో మూడవ పుణ్య స్నానం జనవరి 29న అంటే మౌని అమావాస్య రోజున జరగనుంది. ఆ రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు మహా కుంభ స్నానం చేసే వారి సంఖ్య 15 కోట్లు దాటింది. గడచిన 17 రోజుల్లో 15 కోట్లకు పైగా జనం మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు, సాధువులు స్నానమాచరించారు.
రాబోయే మౌని అమావాస్య సందర్భంగా 8 నుండి 10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వస్తారనే అంచనాలున్నాయి. 2025 మహా కుంభమేళాకు మొత్తంగా 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య అనంతరం ఫిబ్రవరిలో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం జరగనుంది. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26న అంటే మహాశివరాత్రి రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.
ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
Comments
Please login to add a commentAdd a comment