
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాలు, క్రీడలు, అధికారిక, వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కరోనా టీకా బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం త్వరలోనే అనుమతిచ్చే అవకాశముందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. దీన్ని ప్రైవేట్ కేంద్రాల్లో ఇవ్వాలా, ఉచితంగానా, రుసుముతోనా అనేదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించాయి. 60 ఏళ్లు దాటిన వారితోపాటు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్ డోసుఇస్తున్నారు. కొన్ని దేశాలు బూస్టర్ డోసు తీసుకున్నవారినే దేశంలోకి అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఆదివారం నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విదేశాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పాలంటే సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment