
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ డచ్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ డీఎల్‌ఎల్ ఇండియాకు చెందిన ఆస్తుల (రుణాలు)ను సొంతం చేసుకుంది. రూ. 650 కోట్లకుపైగా విలువైన అగ్రి, హెల్త్‌కేర్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను చేజిక్కించుకున్నట్లు కొటక్ బ్యాంక్ తాజాగా పేర్కొంది.
అయితే డీల్ విలువను వెల్లడించలేదు. వీటిలో రూ. 582 కోట్ల రుణాలను క్లాసిఫైడ్, స్టాండర్డ్‌గా వర్గీకరించగా.. మరో రూ. 69 కోట్లు మొండి బకాయిలు (ఎన్‌పీఏలు)గా తెలియజేసింది. తమ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకోవడం ద్వారా కొటక్ బ్యాంక్ 25,000 అత్యంత నాణ్యమైన కస్టమర్లను పొందనున్నట్లు రాబోబ్యాంక్‌కు అనుబంధ సంస్థ అయిన డీఎల్‌ఎల్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment