సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 27 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రీఐపీవో ప్లేస్‌మెంట్‌లో భాగంగా రూ. 100 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. దీంతో ఐపీవో పరిమాణాన్ని కుదించే అవకాశముంది. అర్హతగల కంపెనీ ఉద్యోగులకు కొంతమేర షేర్లను రిజర్వ్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర అట్లాంటాలోని స్టెరైల్ ఇంజక్షన్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. ఈ బాటలో అనుబంధ సంస్థల వర్కింగ్ క్యాపిటల్, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు సైతం నిధులు వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment