సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరోటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయిసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు లభించింది. ప్రఖ్యాత బిజినెస్ మింట్.. నేషన్‌వైడ్ హెల్త్‌కేర్ అవార్డ్స్‌ను మంగళవారం ప్రకటించింది. వైద్య ఆరోగ్య రంగంలో చేసిన కృషికి లాస్యసింధును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన తీవ్ర అంతరాయాల మధ్య, అడ్డంకులను అధిగమించి, రోగుల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు తెచ్చిన ఆస్పత్రులు, క్లినిక్‌లు, డాక్టర్లకు అవార్డులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment