Sai sindhu
-
డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరోటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయిసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు లభించింది. ప్రఖ్యాత బిజినెస్ మింట్.. నేషన్వైడ్ హెల్త్‌కేర్ అవార్డ్స్‌ను మంగళవారం ప్రకటించింది. వైద్య ఆరోగ్య రంగంలో చేసిన కృషికి లాస్యసింధును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన తీవ్ర అంతరాయాల మధ్య, అడ్డంకులను అధిగమించి, రోగుల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు తెచ్చిన ఆస్పత్రులు, క్లినిక్‌లు, డాక్టర్లకు అవార్డులు ప్రకటించారు. -
సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపుపై పిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో రూ.500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని సాయిసింధు ఫౌండేషన్‌కు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ వేయాలని ఆదేశించింది. ఫౌండేషన్‌కు భూమిని కేటాయిస్తూ 2018 మార్చి 22న జారీ చేసిన జీవో 59, ఆగస్టులో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లను రద్దు చేయాలని హైదరాబాద్‌కు చెందిన ఉర్మిళా పింగ్లేతోపాటు పలువురు పిల్ వేశారు. దీనిని శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం విచారించింది.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు మరో నాలుగు వారాల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ భూకేటాయింపులు చట్ట వ్యతిరేకమని తేలితే నిర్మాణాల్ని కూల్చివేసేందుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయవచ్చంది. కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. -
'మా అమ్మాయిని అల్లుడే చంపాడు'
నెల్లూరు: అమెరికాలో నెల్లూరుకు చెందిన సాయి సింధు అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అదనపు కట్నం కోసమే అల్లుడు...తమ కుమార్తెను హత్య చేశాడని సింధు తల్లిదండ్రులు బుధవారం నెల్లూరులో ఆరోపించారు. యూఎస్ కాలిఫోర్నియాలో ఉద్యోగం చేసుకుంటున్న ఉదయ్ కుమార్‌కు సాయి సింధును ఇచ్చి వివాహం జరిపించామని చెప్పారు. అయితే అదనపు కట్నం కోసం పెళ్లయిన నాటి నుంచి సాయి సింధును ఉదయ్ వేధించే వాడని వారు ఆరోపించారు. మీ కుమార్తె మరణించిందని ఫోన్లో తెలిపిన ఉదయ్... ఎలా అని తాము ప్రశ్నించగా అనారోగ్యంతో అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టాశాడని సాయి సింధు తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు.