
న్యూఢిల్లీ: సింగపూర్ లిస్టెడ్ సంస్థ ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్‌కు (ఆర్‌హెచ్‌టీ) చెందిన వ్యాపార విభాగాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ రూ. 4,650 కోట్లుగా ఉంటుం దని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆర్‌హెచ్‌టీకి చెందిన భారత అనుబంధ సంస్థలను పూర్తిగా ఫోర్టిస్ కొనుగోలు చేయనుంది.
దీంతో పాటు ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఆ సంస్థకున్న 49 శాతం వాటాలు, భారత్‌లో ఆ సంస్థకి ఉన్న క్లినిక్‌లు.. ఆస్పత్రుల అసెట్ పోర్ట్‌ఫోలియోను కూడా ఫోర్టిస్ కొనుగోలు చేస్తుంది. ఆర్‌హెచ్‌టీలో ఫోర్టిస్‌కి ప్రస్తుతం పరోక్షంగా 29.76 శాతం మేర వాటాలు ఉన్నాయి. ఆర్‌హెచ్‌టీ అసెట్స్‌ని పునర్‌వ్యవస్థీకరించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment