భారత్‌లో హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ)లో ఏటా జరుగుతున్న అవకతవకలు కనిష్టంగా రూ.800 కోట్లు. ఇది కేవలం బీమా కంపెనీలు, ట్రస్టులు, హైబ్రీడ్ విధానంలో ఆరోగ్య సేవలందిస్తున్న కంపెనీల్లో జరిగేది మాత్రమే. ఇక వ్యక్తిగతంగా సర్విసులు పొందుతున్న వ్యక్తులకు సంబంధించిన కేటగిరీలో జరిగే అక్రమాలు ఇంతకు ఎన్నో రెట్లు ఉంటాయి. –ఆరోగ్య సంరక్షణలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అమలు నివేదికలో డబ్ల్యూహెచ్‌ఓ
సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే హెల్త్‌కేర్ కేటగిరీలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పద్ధతుల వినియోగం ద్వారా చెక్ పెట్టొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నట్లు పేర్కొంది.
ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యాక అందించే చికిత్స, శస్త్రచికిత్సలో వివిధ రకాల పరికరాలు, మందులను వినియోగిస్తారు. ఈ ఖర్చంతా రోగి ఖాతాలో జమచేసి బిల్లులు వసూలు వేస్తారు. ఈ క్రమంలో అక్రమాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రోగి డిశ్చార్జ్ సమయంలో బిల్లును పూర్తిస్థాయిలో పరిశీలించే పరిస్థితి లేకుండా మొత్తం బిల్లు వసూలు చేస్తారు.
అయితే బీమా కంపెనీలు, ట్రస్టుల ద్వారా అమలయ్యే హెల్త్ కేర్ కార్యక్రమాల్లో ఈ బిల్లును కూలంకశంగా పరిశీలించి అవసరమైన మేరకు బిల్లును కుదించడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో అనవసర మందులు, వినియోగాన్ని గుర్తించి బిల్లు నుంచి తొలగించే సందర్భాలను ప్రస్తావిస్తూ డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ అవకతవక లకు చెక్ పెట్టేందుకు ఏఐ, ఎంఎల్‌ను అందుబాటులోకి తీసుకొస్తే పారదర్శకత పెరుగుతుందని తెలిపింది.
తెలంగాణ విధానం భేష్
ఏఐ, ఎంఎల్ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రస్తావించింది. ‘రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక భద్రత పింఛన్లు, లబి్ధదారుల గుర్తింపు ప్ర క్రియలో ఏఐ, ఎంఎల్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది. పెన్షన్ల పథకంలో ఏఐ విధానంలో భాగంగా బయోమెట్రిక్ ద్వారా లబి్ధదారు లైవ్ సర్టిఫికెట్లు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పలు పథకాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో వెరిఫికేషన్ చేయడం ద్వారా పారదర్శకంగా ఎంపికప్రక్రియను నిర్వహిస్తోంది. ఇక్కడ 96 శాతం సక్సెస్ రేట్ ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకంలో కొంతవరకు ఏఐని తెచ్చారు. ఆరోగ్యశ్రీలో ఫొటో తీసుకుని డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే సర్జరీకి ముందే లబ్ధిదారు నిర్ధారణ చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.
‘ఆయుష్మాన్’లో ప్రైవేటు ఆస్పత్రులు చేరట్లేదు
ఆయుష్మాన్ భారత్ పథకానికి కేటాయించిన నిధుల్లో 60 శాతం మాత్రమే ఖర్చవుతోందని పార్లమెంటరీ స్ధాయీ సంఘం ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అలాగే, దేశంలోని 30 శాతం మందికి ఏ రకమైన ఆరోగ్య సంరక్షణ లేదని తెలిపింది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా సగానికిపైగా ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకంలో చేరలేదు. కృత్రిమ మేథను సమర్థవంతంగా వినియోగిస్తే ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసి సాధ్యమైనంత ఎక్కువ మందికి సేవలు అందించే అవకాశం ఉంటుంది. –డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వినర్
Comments
Please login to add a commentAdd a comment