
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆసరాగా చేసుకుని ఆన్ డిమాండ్ హెల్త్‌కేర్ సేవలు అందిస్తున్న ఎంఫైన్ వేగంగా తన సర్వీసులను విస్తరిస్తోంది. 80 ఆసుప్రతులకు చెందిన 18 విభాగాల్లో పనిచేస్తున్న 300కు పైగా డాక్టర్లతో కంపెనీ చేతులు కలిపింది.
నిముషంలో వీడియో కాల్ ద్వారా ఈ వైద్యులను సంప్రతించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 50,000 పైగా కస్టమర్లు తమ సేవలను అందుకున్నారని ఎంఫైన్ సీఈవో ప్రసాద్ కొంపల్లి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో 22 ఆసుపత్రులతో ఎంఫైన్‌కు భాగస్వామ్యం ఉంది. 100 మంది వైద్యుల ద్వారా 5,000 పైచిలుకు కస్టమర్లు వైద్య సేవలు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment