
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ కంపెనీ గ్రాన్సూల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 8 శాతం బలపడి రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 111 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 16 శాతం పుంజుకుని రూ. 850 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 736 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 0.25 మధ్యంతర డివిడెండును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment