ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) బీసీజీ భాగస్వామ్యంతో 'విన్నింగ్ ఇన్ ఇండియన్ హెల్త్‌కేర్' పేరుతో కొత్త నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఓపీపీఐ యాన్యువల్ సమ్మిట్ 2024: వికసిత్ భారత్ 2047థీమ్‌తో ప్రారంభించారు. భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఫార్మా పవర్‌హౌస్‌గా ప్రపంచానికి పరిచయం చేయాలి.. అనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
ప్రస్తుతం భారతదేశ ఔషధ మార్కెట్.. విలువ సుమారు 60 బిలియన్లు. ఈ విలువ 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారత ఆరోగ్య సంరక్షణ రంగం ఒక బలమైన ఔషధ పర్యావరణ వ్యవస్థ ద్వారా త్వరిత విస్తరణకు సిద్ధంగా ఉంది. దేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మార్చడంలో.. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. దీనికోసం వినూత్న సాంకేతికతలను ప్రవేశపెట్టారు. రోగుల సహాయ కార్యక్రమాలను అమలు చేశారు. కమ్యూనిటీ అవసరాలను తీర్చడానికి స్థానిక సామర్థ్యాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టారు.
సుమారు 70 శాతం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు.. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 10 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని సాధించగలవని అంచనా. ఇది వికసిత భారత్ లక్ష్యానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఓపీపీఐ డైరెక్టర్ జనరల్ అనిల్ మాతాయ్ మాట్లాడుతూ.. భారతదేశ బలమైన ఫార్మా పర్యావరణ వ్యవస్థ, దూరదృష్టితో కూడిన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫార్మా పవర్‌హౌస్‌గా నిలిపింది. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ 120 బిలియన్లకు చేరుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీనియర్ పార్టనర్ ప్రియాంక అగర్వాల్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ రెట్టింపు అవుతుందని చెబుతూ.. ప్రపంచ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గణనీయమైన అవకాశాలను అందజేస్తుందని తెలిపారు. గ్లోబల్ ఫార్మా కంపెనీలు ఇప్పటికే గణనీయమైన వ్యాపారాలను నిర్మించాయి. దేశీయ మార్కెట్‌కు సేవ చేయడానికి మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి బలమైన ఆసక్తిని చూపుతున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment