హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ(ఏఐఎన్‌యూ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్(ఏహెచ్‌హెచ్) తాజాగా పేర్కొంది. తదుపరి దశలో రూ. 600 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పెట్టుబడులను ప్రైమరీ, సెకండరీ ఈక్విటీ మార్గంలో చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా కొనుగోలు ద్వారా ఏహెచ్‌హెచ్ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోకి ప్రవేశించనుంది.
డాక్టర్లయిన సి. మల్లికార్జున్, పి.సి. రెడ్డిల నేతృత్వంలో ప్రముఖ యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు కలిసి 2013లో ఏఐఎన్‌యూను ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్, విశాఖపట్టణం, సిలిగురి, చెన్నైలలో 7 ఆసుపత్రులు ఉన్నాయి. రోబోటిక్ యూరాలజీ సర్జరీలో ప్రత్యేకతను కలిగి ఉంది. 500కుపైగా పడకలతో సేవలను అందిస్తోంది. 4 లక్షలకుపైగా రోగులకు సేవలు అందించడంతోపాటు యూరాలజీలో 1,000కి పైగా రోబోటిక్ సర్జరీలను పూర్తి చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌కు ఏఐఎన్‌యూ కొత్త స్పెషాలిటీలను జత చేయడమేకాకుండా సంస్థ విజన్ మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడనుందంటూ ఏహెచ్‌హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విశాల్ బాలి పేర్కొన్నారు.
నగరాలలోనేకాకుండా టైర్–2 పట్టణాలలోనూ యూరాలజీ రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు ఏఐఎన్‌యూ ఎండీ, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున్ తెలియజేశారు. భవిష్యత్‌లో యూరోఆంకాలజీ, యూరోగైనకాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ సేవలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఈడీ పి.సి. రెడ్డి వివరించారు. సంస్థ తదుపరి దశ వృద్ధికి ఏహెచ్‌హెచ్ దోహదపడగలదని పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఏహెచ్‌హెచ్ పోర్ట్‌ఫోలియోలో మదర్‌హుడ్ హాస్పిటల్స్, నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వంటి సంస్థలు ఉన్నాయి. మదర్‌హుడ్ హాస్పిటల్స్‌కు 11 నగరాల్లో 23 మహిళా, శిశు ఆస్పత్రులు, నోవా ఐవీఎఫ్‌కు 44 నగరాల్లో 68 ఐవీఎస్ సెంటర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment