
తిరువనంతపురం: కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. దీన్ని నివారించేందుకుగానూ కోవిడ్ కేర్ వర్కర్ల కోసం కేరళ ప్రభుత్వం త్రీ టైర్ పూల్ విధానాన్ని తీసుకురానుంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం సిబ్బందిని కోవిడ్ పూల్, ఆఫ్ డ్యూటీ పూల్, రొటీన్ పూల్ అని మూడు రకాలుగా విభజిస్తారు. కోవిడ్ పూల్‌లో పని చేసిన వారు తర్వాత ఆఫ్ డ్యూటీ పూల్ కింద పని చేస్తారు. అనంతరం రొటీన్ పూల్‌లోకి వెళ్తారు. ఆ తర్వాత తిరిగి కోవిడ్ పూల్‌లో పని చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ కొత్త విధానం పరిధిలోకి వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అసిస్టెంట్లు, ఆసుపత్రి అటెండెంట్లు, డ్రైవర్లు ఇతరులు వస్తారు. (కోవిడ్ వ్యర్థాలివే...)
కోవిడ్ కేర్ విభాగం కింద వచ్చేవారు పది రోజులు పని చేస్తే ఆ తర్వాతి 10 రోజులు సెలవు తీసుకోవాలి. వీరు రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఎనిమిది గంటల షిఫ్టులో నాలుగు గంటలు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ కిట్) ధరించి, మరో 4 గంటలు పీపీఈ కిట్ లేకుండా పని చేయాలి. వీరి ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం "ఎమర్జెన్సీ రిలీవర్స్ టీమ్" కూడా ఉంటుంది. ఇందులో 15 మంది సిబ్బంది ఉంటారు. డ్యూటీ ముగిసిన తర్వాత హెల్త్‌కేర్ వర్కర్లు ఆసుపత్రిలోనే స్నానం చేయాలి. (కేరళ ఆయుర్వేదం గెలిచింది!)
Comments
Please login to add a commentAdd a comment