గ్లోబల్‌ లక్ష్యాల్ని అందుకోలేపోయాం | India Yet To Achieve Global Goals In Healthcare: Narayana Murthy | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ లక్ష్యాల్ని అందుకోలేపోయాం

Published Wed, Feb 8 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

గ్లోబల్‌ లక్ష్యాల్ని అందుకోలేపోయాం

గ్లోబల్‌ లక్ష్యాల్ని అందుకోలేపోయాం

హైదరాబాద్: భారతదేశంలో వైద్యరంగం అభివృద్ధిగణనీయంగా ఉన‍్నప్పటికీ  అంతర్జాతీయ  ప్రమాణాలను చేరుకోవడంలో  ఇంకా వెనకబడే ఉన్నట్టు ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌  నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. భారతీయుల సగటు ఆయు ప్రమాణం పెరిగినా.. మిలీనియం అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని తెలిపారు. దేశీయ హెల్త్‌కేర​ సెక్టార్‌  అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి మరింత సుదీర్ఘ కాలం పట్టే అవకాశంఉందన్నారు. 

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బయో ఆసియా 2017 సదస్సులో  బుధవారం  మాట్లాడిన ఆయన ప్రపంచ బ్యాంక్‌ రిపోర్టును ఉటంకిస్తూ  ఈ వ్యాఖ్యలు చేశారు.  దేశంలో  శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ, "మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు"  అందుకోలేకపోయిందని చెప్పారు.  ముఖ్యంగా   ఆరోగ్య సంరక్షణపై ఎక్కువగా పెట్టుబడులుపెట్టిన చైనా, బ్రెజిల్‌  తో పోలిస్తే ఇండియా వెనుకబడి ఉందన్నారు.  చికున్‌ గున్యా,  డెంగ్యూకేసుల నమోదు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక‍్తం చేశారు.  భారతీయ రాష్ట్రాల్లో కొన్నిదక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల  భారీ వ్యత్యాసాలను ఉన్నాయని చెప్పారు.
ప్రజల ఆరోగ్య సమస్యలపై  శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లాంటి  చిన్న పొరుగు దేశాలకంటే కూడా  తీసిపోయినట్టు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక  ప్రకారం 1995- 2015కాలంలో మోర్టాలిటీ రేటు  25 పాయింట్ల మేర క్షీణించిందని మూర్తి పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement