న్యూఢిల్లీ: జనరిక్ ప్రొడక్టుల హెల్త్‌కేర్ కంపెనీ జిమ్ ల్యాబొరేటరీస్ తాజాగా ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యింది. శుక్రవారం రూ. 336 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 340 వద్ద గరిష్టం, రూ. 330 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 3 శాతం లాభంతో రూ. 332 వద్ద ముగిసింది.
బీఎస్‌ఈలో 2018 జూన్‌లోనే లిస్టయిన స్మాల్ క్యాప్ కంపెనీ వారాంతాన ఎన్‌ఎస్‌ఈలోనూ లిస్టింగ్‌ను సాధించింది. విభిన్న, నూతన తరహా జనరిక్ ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, ఎండీ అన్వర్ డి. పేర్కొన్నారు. వీటిని ఈయూ మార్కెట్లలో ఫైలింగ్ చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రధానంగా నూతనతరహా డ్రగ్ డెలివరీ సొల్యూషన్స్ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment