మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. హోరా హోరీగా సాగుతున్న ఈ బాక్సింగ్ డే టెస్టు ఫలితం సోమవారం తేలిపోనుంది. నాలుగో రోజు ఆటలో తొలి రెండు సెషన్స్‌లో భారత్ పై చేయి సాధించినప్పటికి.. ఆఖరి సెషన్‌లో మాత్రం కంగారులు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు.
ముఖ్యంగా టెయిలాండర్లు నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ పదో వికెట్‌కు 55 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మొత్తంగా ఈ వెటరన్ జోడీ 110 బంతులు ఎదుర్కొని తమ జట్టుకు అడ్డుగోడగా నిలిచారు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
క్రీజ్‌లో నాథన్ లైయన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆసీస్ భారత్ ముందు 333 నుంచి 350 పరుగుల మధ్య టార్గెట్‌ను నిర్దేశించే అవకాశముంది. ఈ క్రమంలో భారత్ ఈ టార్గెట్‌ను చేధిస్తే 96 ఏళ్ల ఇంగ్లండ్ ఆల్‌టైమ్ బద్దలు కానుంది.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్టుల్లో అత్యధిక రన్ ఛేజింగ్ 322 పరుగులగా ఉంది. 1928లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 322 లక్ష్యాన్ని చేధించింది. ఆ తర్వాత ఈ వేదికగా 300పైగా టార్గెట్‌ను ఏ జట్టు కూడా చేధించలేకపోయింది. ఇప్పుడు భారత్‌కు చరిత్రను తిరగరాసే అవకాశం లభించింది.
మెల్‌బోర్న్‌లో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవే..
322- ఇంగ్లండ్- ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1928
297-ఇంగ్లండ్- ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1895
295-దక్షిణాఫ్రికా-ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1953
286-ఆస్ట్రేలియా-ప్రత్యర్ధి(ఇంగ్లండ్)-1929
282-ఇంగ్లండ్-ప్రత్యర్ధి(ఇంగ్లండ్)-1908
ఎంసీజీలో భారత్ రికార్డు ఎలా ఉందంటే?
కాగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే లక్ష్యాన్ని చేధించిగల్గింది. 2020 డిసెంబర్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. అంతకమించి లక్ష్యాన్ని భారత్ ఛేజ్ చేయలేకపోయింది.
అయితే 2018/19 ఆసీస్ పర్యటనలో భాగంగా ఇదే మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్బుతవిజయం సాధించింది. 137 పరుగుల తేడాతో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు పడగొట్టి కంగారులను దెబ్బ తీశాడు. కాగా ఆస్ట్రేలియాలో భారత్ అత్యధిక టెస్టు ఛేజింగ్ 329గా ఉంది. 2021లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఈ ఫీట్ సాధించింది.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ అల్‌టైమ్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment