అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్.. నూతన బ్రాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సంస్థ ప్రిన్సిపల్, ఫౌండర్ నరేష్ ఎం గెహి, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్,మోడల్ అండ్ సోషలైట్ సుధా జైన్ , తదితరులు ముఖ్యతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసినట్లు ఎన్.ఎం గెహి తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని వివరించారు.
భారత్, అమెరికా మధ్య అంతరాన్ని తగ్గించే ఈ ప్రయాణం గేహిస్ ఇమ్మిగ్రేషన్‌కు ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలు అమెరికాకు అందించడంలో భారతదేశం ఎపుడు అగ్రగామిగా ఉంటుందన్నారు. ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ న్యాయ సేవల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైనా వారికి అందుబాటులో ఉండటానికి మరిన్ని ప్రదేశాలలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నరేష్ ఎం గెహి పేర్కొన్నారు.
గెహిస్ లీగల్ సర్వీసెస్ ముంబాయి తర్వాత రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని అద్దంకి దయాకర్ అన్నారు. తెలుగువారు అత్యధికంగా అమెరికాలో నివసిస్తున్నారని, అలాంటివారికి అక్కడ తలెత్తే సమస్యలకు సరైన సలహాలు అందిస్తూ పరిష్కారాల కోసం పనిచేస్తున్న గెహిస్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
(చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్)
Comments
Please login to add a commentAdd a comment