చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్‌ దేవ్‌ అల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ | Jasprit Bumrah Creates History In Australia, Breaks Kapil dev all time record | Sakshi
Sakshi News home page

IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్‌ దేవ్‌ అల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Published Sun, Dec 29 2024 4:23 PM | Last Updated on Sun, Dec 29 2024 4:39 PM

Jasprit Bumrah Creates History In Australia, Breaks Kapil dev all time record

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో సైతం బుమ్రా నిప్పుల చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్ల‌తో సత్తాచాటాడు. ట్రావిస్ హెడ్‌, అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ వంటి కీల‌క వికెట్ల‌ను ప‌డ‌గొట్టి  భార‌త్‌ను తిరిగి గేమ్‌లోకి తీసుకువ‌చ్చాడు.

ఈ క్ర‌మంలో బుమ్రా ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన భార‌త ఫాస్ట్ బౌల‌ర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా ఇప్ప‌టివ‌ర‌కు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం క‌పిల్ దేవ్(25) పేరిట ఉండేది. 1991-92లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు.తాజా మ్యాచ్‌తో కపిల్‌ దేవ్‌ అల్‌టైమ్‌ రికార్డును బుమ్రా బ్రేక్‌ చేశాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో బుమ్రా తన 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయాని వస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ త​మ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో నాథన్‌ లియోన్‌(41 నాటౌట్‌), స్కాట్‌ బోలాండ్‌(10 నాటౌట్‌) ఉన్నారు.
చదవండి: టీ20 క్రికెటర్‌ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్‌

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement