భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆసీస్-భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో ఆతిథ్య ఆసీస్‌ను ఓడించాలి.
కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా..
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.
బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్టులు ఆడి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లను తీస్తే కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భాత బౌలర్లు వీరే
కపిల్ దేవ్ - 51
అనిల్ కుంబ్లే - 49
రవిచంద్రన్ అశ్విన్ - 39
బిషన్ సింగ్ బేడీ - 35
జస్ప్రీత్ బుమ్రా - 32
ఎరపల్లి ప్రసన్న – 31
మహ్మద్ షమీ - 31
ఉమేష్ యాదవ్ - 31
ఇషాంత్ శర్మ - 31
చదవండి: WI Vs ENG 4th T20: విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
Comments
Please login to add a commentAdd a comment