
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2024-25)ని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శనకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.
బుమ్రా.. ఓవరాల్‌గా 32 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తాజాగా టీమిండియా పేస్ గుర్రంపై ఆస్ట్రేలియా యువ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీని ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని అతడు కొనియాడాడు. అదేవిధంగా బుమ్రా బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ ఆసీస్ యువ క్రికెటర్ వెల్లడించాడు.
"బుమ్రాను ఎదుర్కొవడం చాలా కష్టం. బీజీటీలో అతడి నుంచి నాకు కఠిన సవాలు ఎదురైంది. అతడు బౌలింగ్‌ను ఆర్ధం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాను. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఎప్పుడూ అతనిని ఎదుర్కోలేదు.
బహుశా నేను విఫలమవడానికి ఇదొక కారణం కావచ్చు. బుమ్రాకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. బంతిని ఏ ప్రాంతంలో సంధిస్తే బ్యాటర్ ఇబ్బంది పడతాడో అతడికి బాగా తెలుసు. అందుకే అతడిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో నేను ఒక్కడినే కాదు మా జట్టులోని ఇతర ఆటగాళ్లూ సైతం బుమ్రాపై పైచేయి సాధించలేకపోయారు.
నాకు అదికాస్త ఆత్మవిశ్వాసం ఇచ్చింది అని విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌స్వీనీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో మెక్‌స్వీనిని మూడు టెస్టుల్లో 4 సార్లు బుమ్రానే ఔట్ చేశాడు. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టులో బుమ్రా వెన్ను గాయం తిరగబెట్టింది. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఏన్సీఎలో ఉన్న జస్ప్రీత్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. సంజూ ఇంకా బెంగళూరులోనే?
Comments
Please login to add a commentAdd a comment