దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. శీతాకాలంలో వర్షాలు కురవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో పొగమంచు పెరిగేందుకు అవకాశం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటుంటారు. సాధారణంగా వేసవికాలంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లగా మారి, మనకు హాయినిస్తుంది. అలాగే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతుంది. మరి శీతాకాలంలో వర్షం పడినప్పుడు ఏమి జరుగుతుంది?
మనదేశంలో శీతాకాలంలో వర్షాలు పడటం అనేది అతి అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ వర్షాలుకు రుతుపవనాలకు ఏమాత్రం సంబంధం లేదు. భారత్‌తో చలికాలంలో వాయువ్య దిశ నుండి వచ్చే గాలులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిని వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ అంటారు. ఈ గాలులు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి వస్తాయి. ఈ గాలుల కారణంగా వాతావరణంలో అల్ప పీడనం ఏర్పడుతుంది. ఫలితంగా వర్షాలు కురుస్తాయి.
ఉష్ణోగ్రతలపై ప్రభావం
భారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో కురుస్తున్న మంచు కారణంగా ఏర్పడే చలి మైదాన ప్రాంతాల వరకూ వ్యాపిస్తుంది. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఈ సమయంలో కురిసే వర్షం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఈ వర్షం కారణంగా ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. గాలిలో తేమ పెరుగుతుంది. ఈ రెండింటి కలయిక కారణంగా చలి మరింతగా పెరుగుతుంది. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడితే, అక్కడ చలి తగ్గుతుంది. చాలా చల్లగా ఉండే ప్రాంతాల్లో, కురిసే వర్షపు నీరు ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే అత్యంత అరుదుగా ఇది జరుగుతుంది. శీతాకాలంలో కురిసే తేలికపాటి వర్షం ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోకుండా కాపాడుతుంది.
గాలిలో తేమశాతం పెరిగి..
ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వర్షం కారణంగా, గాలిలో తేమశాతం చాలావరకూ పెరుగుతుంది. పొగమంచు కూడా పెరుగుతుంది. మరోవైపు ఇప్పటికే పొగమంచు ఉన్న ప్రాంతాల్లో, వర్షాలు కురిస్తే పొగమంచు తగ్గుతుంది. చలికాలంలో కురిసే వర్షాల వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ వంటి ప్రాంతాలలో కాలుష్యాన్ని తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో వర్షాలు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో కురిసే వర్షాలు గాలిలోని కాలుష్య కారకాలను కడిగివేస్తాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. పొగ, కాలుష్యం అధికంగా ఉండే నగరాల్లో వర్షం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఉత్తర భారతదేశంలో కురిసే శీతాకాలపు వానలు చలి గాలులను పెంచవు. వర్షం పడితే అది ఖచ్చితంగా చలిని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కానీ చలిగాలులను నియంత్రింపజేయదు. చలికాలంలో కురిసే వర్షం చల్లదనాన్ని తగ్గించడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటువంటి వర్షం గాలిలో తేమను, చల్లదనాన్ని పెంచుతుంది. అదే సమయంలో కలుషితమైన గాలిని తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు
Comments
Please login to add a commentAdd a comment