affect
-
చలి కాలంలో వర్షం.. అనుకూలమా? ప్రతికూలమా?
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. శీతాకాలంలో వర్షాలు కురవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో పొగమంచు పెరిగేందుకు అవకాశం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటుంటారు. సాధారణంగా వేసవికాలంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లగా మారి, మనకు హాయినిస్తుంది. అలాగే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతుంది. మరి శీతాకాలంలో వర్షం పడినప్పుడు ఏమి జరుగుతుంది?మనదేశంలో శీతాకాలంలో వర్షాలు పడటం అనేది అతి అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ వర్షాలుకు రుతుపవనాలకు ఏమాత్రం సంబంధం లేదు. భారత్‌తో చలికాలంలో వాయువ్య దిశ నుండి వచ్చే గాలులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిని వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ అంటారు. ఈ గాలులు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి వస్తాయి. ఈ గాలుల కారణంగా వాతావరణంలో అల్ప పీడనం ఏర్పడుతుంది. ఫలితంగా వర్షాలు కురుస్తాయి.ఉష్ణోగ్రతలపై ప్రభావంభారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో కురుస్తున్న మంచు కారణంగా ఏర్పడే చలి మైదాన ప్రాంతాల వరకూ వ్యాపిస్తుంది. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఈ సమయంలో కురిసే వర్షం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఈ వర్షం కారణంగా ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. గాలిలో తేమ పెరుగుతుంది. ఈ రెండింటి కలయిక కారణంగా చలి మరింతగా పెరుగుతుంది. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడితే, అక్కడ చలి తగ్గుతుంది. చాలా చల్లగా ఉండే ప్రాంతాల్లో, కురిసే వర్షపు నీరు ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే అత్యంత అరుదుగా ఇది జరుగుతుంది. శీతాకాలంలో కురిసే తేలికపాటి వర్షం ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోకుండా కాపాడుతుంది.గాలిలో తేమశాతం పెరిగి..ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వర్షం కారణంగా, గాలిలో తేమశాతం చాలావరకూ పెరుగుతుంది. పొగమంచు కూడా పెరుగుతుంది. మరోవైపు ఇప్పటికే పొగమంచు ఉన్న ప్రాంతాల్లో, వర్షాలు కురిస్తే పొగమంచు తగ్గుతుంది. చలికాలంలో కురిసే వర్షాల వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాలలో కాలుష్యాన్ని తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో వర్షాలు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో కురిసే వర్షాలు గాలిలోని కాలుష్య కారకాలను కడిగివేస్తాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. పొగ, కాలుష్యం అధికంగా ఉండే నగరాల్లో వర్షం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఉత్తర భారతదేశంలో కురిసే శీతాకాలపు వానలు చలి గాలులను పెంచవు. వర్షం పడితే అది ఖచ్చితంగా చలిని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కానీ చలిగాలులను నియంత్రింపజేయదు. చలికాలంలో కురిసే వర్షం చల్లదనాన్ని తగ్గించడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటువంటి వర్షం గాలిలో తేమను, చల్లదనాన్ని పెంచుతుంది. అదే సమయంలో కలుషితమైన గాలిని తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
"చంద్రుడు" ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసా!
భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. చందమామ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ని సురక్షితంగా దించిన నాల్గో దేశంగా ఘనత సాధించింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజుల పాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా ముగించింది. ఈ విజయం దేశ ప్రజలను ఆనందోత్సాహల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా ఓ పండుగను తీసుకొచ్చింది ఈ విజయం. ఇక ఖగోళ శాస్త్ర పరంగా అంతరిక్షంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి కుతూహలంగానే ఉంటుంది. అందులోనూ మనం చిన్నప్పటి నుంచి మామ అని ఇష్టంగా పిలుచుకును చంద్రుడు గురించి ఐతే ఆ జిజ్ఞాస మరింత ఎక్కువగా ఉంటుంది. చంద్రుడిపై మచ్చ ఉందని ఏవేవో చందమమా కథలను చెప్పుకునేవాళ్లం. అలాంటి చంద్రుడు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసుకుందామా!. చంద్రుని గురించి పౌరాణికంగా చాలా విషయాలను కథలు కథలుగా తెలుసుకున్నాం. పురాణాల ప్రకారం చంద్రుడుని మనః కారకుడని అంటారు. చంద్రుడు మనిషి మససుపై అధిక ప్రభావం చూపుతాడని, చంద్రుని ఆధారంగానే మనిషి ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. మనిషి నిద్రపై కూడా చంద్రుని ప్రభావం ఉంటుందని అంటారు. మానసిక ఆరోగ్య దగ్గర నుంచి శారీరకంగా.. గుండె ఆరోగ్యం వరకు ఆయన ప్రభావం ఉంటుందని అంటారు. పౌర్ణమి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. పౌర్ణమి మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పర్యావరణ కారకాలు వ్యక్తుల మానసిక కల్లోలానికి కారణమవుతాయని అందువల్ల వారు నిరాశకు లేదా ఉన్మాదానికి లోనై అకృత్యాలకు పాల్పడతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భావోద్వేగాలకు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి అయిన "బైపోలార్ డిజార్డర్" వ్యక్తులపై పరిశోధనలు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వ్యక్తులు నిద్రలోని మార్పులకు, తరుచుగా కనిపించే మాంద్య లక్షణాల నుంచి ఉన్నాద లక్షణాలకు మారడంపై చంద్రుని ప్రభావం ఉన్నట్లు తేలింది. అలాగే బైపోలార్ డిజార్డర్ ఉన్న ఓ స్త్రీపై మూన్ మూడ్ కనెక్షన్ కోసం లైట్ థెరఫీని ఉపయోగించి కొన్ని మందుల మార్చడం ద్వారా చంద్రుని ప్రభావాల ఆధారంగా చికిత్స చేయవచ్చని వెల్లడైందని మాలిక్యులర్ సెక్రియాట్రిక్ జర్నల్‌లో తెలిపారు శాస్త్రవేత్తలు. నిద్రను ఎలా ప్రభావితం చేస్తాడు? పౌర్ణమి రోజుల్లో చాలామంది వ్యక్తులు సాధారణ సమయం కంటే ఆలస్యంగా నిద్రపోతారని అంటున్నారు నిపుణులు. పౌర్ణమికి ముందు రోజుల నుంచే ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుందని చెబుతున్నారు. నిద్రపోవడం అనేది పౌర్ణమితో ముడిపడి ఉందని పరిశోధనల్లో తేలింది కూడా. ఐతే స్లీప్ లేటెన్సీ..నిద్రలోకి జారుకోవడం లేదా మొదటి నిద్రలోనే గాఢ నిద్రలోకి వెళ్లడం అనేది కూడా ఆల్కహాల్ లేదా కొన్ని రకాల మందుల ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది. . పౌర్ణమి, అమావాస్య సమయంలో హృదయ స్పందన రేటు, రక్తపోటు తగ్గదలను గమనించినట్లు పరిశోధన పేర్కొంది. పౌర్ణమి, అమావాస్య తిథుల్లో తొందరగా రక్తపోటు సాధారణ స్థాయికి తిరిగి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. బహుశా అందువల్లే కాబోలు పెద్దలు ఈ రోజు పౌర్ణమి ఇవే చేయాలి. అమావాస్యని అలాంటివి చేయకూడదు వంటి నియమాలు పెట్టారు. ముందు జాగ్రత్తతోనే నియమాలు పెడితే మనం చాదస్తంగా కొట్టిపారేస్తున్నాం. సైన్సుపరంగా వారు పెట్టినవి నిజమని తేలేంత వరకు అంగీకరించం మనం. గమనిక: ఈ కథనం చంద్రుని శక్తి గురించి కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. సైన్సుపరంగా రుజువైందని తెలియడం కోసం. దీన్ని ఆధారంగా మీరు ఔషధాలను ఉపయోగించడం లేదా ప్రయోగాలు చేయడం వంటి పనులు చేయొద్దు. ఏదైనా వైద్యులు, నిపుణులు సలహాల మేరకే పాటించాలి. ఇది కేవలం అవగాహన కల్పించాలనే ఉద్దేశం మాత్రమే. (చదవండి: మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్‌లు ఏంటో తెలుసా!) -
గ్లోబల్ మార్కెట్లపై గోధుమ ఎగుమతుల నిషేధ ప్రభావం నిల్: కేంద్ర మంత్రి
దావోస్: భారతదేశ గోధుమ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమోడిటీ ఎగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. బలహీన అలాగే పొరుగు దేశాలకు ఎగుమతులను భారతదేశం కొనసాగిస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ గోధుమల మార్కెట్లో భారతదేశం ఎప్పుడూ కీలకప్రాత్ర పోషించలేదని వివరించారు. ఇంకా చెప్పాలంటే రెండేళ్ల క్రితం వరకూ భారత్ గోధుమలను ఎగుమతే చేయలేదని తెలిపారు. దేశం 2 మిలియన్ టన్నులతో ఎగుమతులను ప్రారంభించిందని, గత సంవత్సరం ఈ పరిమాణం ఏడు మిలియన్ టన్నులుగా ఉందని గోయల్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యాల మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడిన తర్వాత గత రెండు నెలల్లో దేశ గోధుమ ఎగుమతులు పెరిగినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సెషన్లో అన్నారు. మొదట్లో ఉత్పత్తి దాదాపు 7 లేదా 8 శాతం పెరుగుతుందని భారత్ అంచనా వేసిందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తీవ్రమైన వేడి వాతావరణం వల్ల ఉత్పత్తిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి, అలాగే పొరుగు, బలహీన దేశాల ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం గోధుమ ఎగుమతులను మే 13న నిషేధించింది. అయితే, ఇతర దేశాల (వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా) ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, ప్రభుత్వం అనుమతుల మేరకు ఎగుమతులకు వెసులుబాటు కల్పించింది. ఉత్పత్తి-గుమతి ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ గోధుమల ఎగుమతులు 7 మిలియన్ టన్నులు. దీని విలువ 2.05 బిలియన్ డాలర్లు. విదేశాల నుండి భారత్ గోధుమలకు మెరుగైన డిమాండ్ ఉంది. మొత్తం గోధుమ ఎగుమతుల్లో 50 శాతం సరుకులు గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు ఎగుమతయ్యాయి. గోధుమ పంటపై మే 14న వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రకటన ప్రకారం, 2021–22 పంట సంవత్సరంలో (జూలై–జూన్) దిగుబడి అంచనా పరిమాణం 111.32 మిలియన్ టన్నులు. అయితే 105–106 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. 2020–21 పంట కాలంలో ఉత్పత్తి 109 మిలియన్ టన్నులు. India wheat exports are less than 1% of world trade and our export regulation should not affect global markets. We continue to allow exports to vulnerable countries and neighbors. pic.twitter.com/N61929BNt5 — Piyush Goyal (@PiyushGoyal) May 25, 2022 -
ఈ ఏడాది భారత జీడీపీ.. మైనస్ 15%
ముంబై: అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇటు భారత్ ఎకానమీపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం తప్పదని పలు అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆయా సంస్థల అంచనాల ప్రకారం భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–21లో మైనస్ 10 శాతం క్షీణత నుంచి మైనస్ 15 శాతం క్షీణత శ్రేణిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రితం క్షీణ అంచనాలను మరింత పెంచడం ఆందోళన కలిగిస్తున్న అంశం. కాగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ కొంత పుంజుకునే వీలుందన్న అంచనాలనూ కొన్ని సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇందుకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా ఉండడం గమనార్హం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదుచేసుకుంటుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్, చైనా మాత్రం 2.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని విశ్లేషిస్తుండడం గమనార్హం. ముఖ్యాంశాలు ఇవీ... 14.8 శాతం క్షీణత... అమెరికా బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్: భారత్ ఎకానమీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో 14.8% వరకూ క్షీణత నమోదు చేసుకుంటుంది. తీవ్ర ప్రతికూలత నేపథ్యంలో క్రితం అంచనా మైనస్ 11.8 శాతాన్ని మరింత పెంచాల్సి వస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో భారీగా నష్టపోతోంది భారతదేశమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొదటి త్రైమాసికంలో 23.9% క్షీణిస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 13.7%గా ఉండవచ్చు. డిసెంబర్ త్రైమాసికంలో 9.8%, చివరి త్రైమాసికంలో 6.7% క్షీణరేట్లు నమోదయ్యే వీలుంది. ఒక్క 2020 క్యాలెండర్ ఇయర్లో క్షీణత 11.1%గా ఉంటే, 2020–21లో మైనస్ 14.8%గా ఉంటుంది. అయితే 2021–22లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే వీలుంది. బేస్ రేటు (2020–21లో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి) క్షీణతలో ఉండడం వల్ల 2021–22లో వృద్ధి రేటు 15.7% ఉండొచ్చు. కఠినమైన లాక్డౌన్ కారణం.. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం... ఫిచ్: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ 5 శాతమే క్షీణిస్తుందని తొలి అంచనా. అయితే ఈ అంచనాను మరింతగా 10.5 శాతానికి పెంచుతున్నాం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా ఎక్కువగా మైనస్ 23.9 శాతంగా ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే ఏ దేశం అనుసరించని రీతిలో భారత్ లాక్‌డౌన్‌ను పాటించింది. దీనితో పెట్టుబడులు, వినియోగం విభాగాలు తీవ్ర ప్రతికూలతలు చూశాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించి నదానికన్నా ఎక్కువగా పతనం అవుతున్న నేపథ్యంలో వర్ధ మాన దేశాల (చైనా కాకుండా) మార్కెట్ల క్షీణ అంచనాలను కూడా క్రితం మైనస్ 4.7% క్షీణత నుంచి మైనస్ 5.7%కి సవరిస్తున్నాం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. అయితే క్రితం అంచనా మైసన్ 4.6 శాతం క్షీణత కన్నా ఇది తక్కువ. కాగా చైనా మాత్రం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ఇంతక్రితం వృద్ధి అంచనా 1.2%. ఇక అమెరికా క్షీణ రేటు అంచనాను మైనస్ 5.6% నుంచి మైనస్ 4.6 శాతానికి సవరిస్తున్నాం. తిరోగమనంలోనే...! ఎస్బీఐ ఎకోర్యాప్ పరిశోధనా నివేదిక: భారత 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్షీణ రేటు అంచనాలకు మైనస్ 6.8 శాతం నుంచి మైనస్ 10.9 శాతానికి పెంచుతున్నాం. మొదటి త్రైమాసిక జీడీపీ భారీగా మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకోగా, రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) ఆర్థిక వ్యవస్థ మైనస్ 12 శాతం నుంచి మైనస్ 15 శాతం వరకూ క్షీణిస్తుంది. మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) ఈ పరిమాణం మైనస్ 5%–మైనస్ 10% వరకూ ఉంటుంది. నాల్గవ త్రైమాసికం (జనవరి–మార్చి)లో ఈ క్షీణ రేటు మైనస్ 2% నుంచి మైనస్ 5 శాతం వరకూ ఉంటుంది. అయితే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విషయంలో రుణ వృద్ధి రేటు కనిపిస్తుండడం, కొన్ని కీలక రంగాల్లో క్షీణరేట్లు తగ్గుతుండడం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న సానుకూల అంశాలు. నష్టం రూ.18.44 లక్షల కోట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్: కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను క్రితం మైనస్ 5.3% నుంచి మైనస్ 11.8%కి పెంచాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏ త్రైమాసికంలోనూ వృద్ధి నమోదయ్యే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థకు 18.44 లక్షల కోట్ల నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ వల్ల 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 9.9 శాతం వృద్ధి బాటకు మళ్లే వీలుంది. లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది. 1951 నుంచీ జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉండగా, 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లో క్షీణ రేట్లు నమోదయ్యాయి. 1980లో మైనస్ 5.2 శాతం క్షీణత చవిచూసింది. -
చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ
చైనా కలల ప్రాజెక్టులను కరోనా గట్టిగా దెబ్బ తీసింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లతో వాణిజ్య సంబంధాల బలోపేతం, పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని డ్రాగన్ దేశం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు వైరస్ సెగ తగిలింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) పేరిట చైనా ప్రారంభించిన మహానిర్మాణంలో అయిదో వంతు ప్రాజెక్టులపై కోవిడ్–19 ప్రభావం పడిందని చైనా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ జియోలాంగ్ వెల్లడించారు. 40 శాతం ప్రాజెక్టులపై అత్యంత తీవ్ర ప్రభావం, 30–40 శాతం ప్రాజెక్టులపై కొంతమేరకు కరోనా ప్రభావం పడిందని ఆయన చెప్పినట్టుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2013లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఐని ప్రారంభించారు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ ప్రాంతం, ఆఫ్రికా, యూరప్‌లను రహదారి, సముద్ర మార్గాల ద్వారా కలుపుతూ బీఆర్ఐ మహా నిర్మాణంలో మొదలైంది. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,951 ప్రాజెక్టుల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. వీటి విలువ 3.87 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని ఒక అంచనా. ఈ ప్రాజెక్టుల్లో అధిక భాగం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీపీఈసీపైనా ప్రభావం 6 వేల కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)పై కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళుతూ ఉండడంతో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంబోడియాలో సిహనౌకువిలే ప్రత్యేక ఆర్థిక మండలి, ఇండోనేసియాకు చెందిన జకార్తా–బాండంగ్ హైస్పీడు రైలు ప్రాజెక్టుల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి త్వరగా ఈ ప్రాజెక్టుల్ని ప్రారంభించాలని సూచించారు. -
కరోనా బాధితుల్లో మగవారే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: కరోనాకు ప్రభావితం అవుతున్న వారిలో అధికంగా పురుషులే ఉంటున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 71 శాతం మగవారే ఉన్నట్లు అంతర్జాతీయ కరోనా అప్డేట్స్ను అందించే ‘వరల్డో మీటర్’అనే వెబ్సైట్ ఇటీవల నివేదికలో వెల్లడించింది. కరోనాతో మహిళలకు రిస్క్ తక్కువగా ఉన్నట్లు తెలిపింది. పొగతాగే అలవాటుండటం, కాలుష్యానికి అధికంగా ప్రభావితం కావడం తదితర కారణాలతో మగవారిలో శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడటం వల్ల కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) అంచనాల ప్రకారం, మరణించిన వారిలో 80 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. వారిలో 75 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్ వంటివి ఉన్నాయని తేలింది. అలాగే ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కువ మంది కరోనాకు గురయ్యేది పురుషులేనని నివేదిక వెల్లడించింది. అంటే 71 శాతం మంది ఈ వైరస్‌కు మగవారు ప్రభావితం అవుతున్నారని తెలిపింది. అయితే కరోనా వైరస్ అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా వృద్ధులు, ఉబ్బసం, డయాబెటీస్, గుండె సమస్యలు ఉన్న వారికి అధికంగా సోకుతుందని నివేదిక తెలిపింది. కాలానుగుణంగా ఫ్లూ, వైరస్ల వల్ల ప్రతీ ఏడాది ప్రపంచంలో 6.50 లక్షల మంది వరకు చనిపోతున్నారని తెలిపింది. 70 ఏళ్లకు పైబడిన వారిలోనే మరణాలు అధికం... కరోనా వైరస్‌కు చనిపోతున్నవారిలో అధికంగా 70 ఏళ్లకు పైబడినవారే ఉన్నారని నివేదిక తెలిపింది. చైనాతోపాటు ప్రపంచంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి లెక్కలను విశ్లేషిస్తే, 70 ఏళ్లకు పైబడినవారు 29.9 శాతం ఉన్నారు. పిల్లల్లో చాలా తక్కువ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. లింగ నిష్పత్తిని లెక్క వేస్తే చైనాలో ధూమపానం మగవారిలో ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ధూమపానం శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కరోనా మరణాల రేటు పురుషుల్లో అధికంగా ఉందని నివేదిక తెలిపింది. కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే... పురుషుల్లో మరణ రేటు 4.7 శాతం, మహిళల్లో 2.8 శాతంగా మరణ రేటు ఉందని తెలిపింది. గుండె వ్యాధులున్న వారిపైనే ప్రభావం కరోనా బారినపడేవారు అధికంగా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారే ఉన్నారని నివేదిక తెలిపింది. గుండె వ్యాధులున్నవారు అధికంగా చనిపోయారు. ఇతరుల వివరాలపై స్పష్టత లేదు. పొగతాగే వారిపై తీవ్ర ప్రభావం పొగతాగే వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కరోనా ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్. పొగతాగే వారికి ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ ప్రధానంగా పొగతాగే అలవాటున్నవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి పొగతాగడాన్ని నిలిపివేయాలి. – నాగ శిరీష, యాంటీ టొబాకో యాక్టివిస్ట్, హైదరాబాద్ -
రెండు రోజులు బ్యాంకులు మూత
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు దిగనున్నారు. మే 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాము ఈ సమ్మెలో పాల్గొననున్నామని యూఎఫ్‌బీయూ ఏపీ, తెలంగాణ శాఖలు తెలిపాయి. మరోవైపు తమ ఉద్యోగులు రెండు రోజులు పాటు సమ్మెకు దిగే అవకాశం ఉందని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. దీంతో తమ వినియోగదారులు, సేవలు కొంతవరకు ప్రభావితం కానున్నాయని తెలిపింది. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని యూఎఫ్‌బీయూ ప్రకటించింది. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా జరిపిన చర్యలు విఫలం కావడంతో సమ్మెకు దిగనున్నట్టు బ్యాంకు సంఘాలు వివరించాయి. తమ పోరాటానికి ఖాతాదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. ముఖ్యంగా జీతం 2శాతం పెంపునకు, ఇతర సేవా పరిస్థితుల్లో మెరుగుదలను డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉందనీ, ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని యూఎఫ్‌బీయూ కోరుతున్న సంగతి తెలిసిందే. -
భారత ఆర్థికవ్యవస్థకు చమురు సెగ
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్‌ను చమురు ధరల సెగ ప్రభావితం చేయనుందని ప్రముఖ ఆర్థిక ఎనలిస్టులు సంస్థలు విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, కరెంట్ అకౌంట్ లోటుకు తోడు రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారనుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కానుందని భావిస్తున్నారు. గురువారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 80 డాలర్ల మార్క్‌ను అధిగమించి,2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకిన సంగతి తెలిసిందే. దేశీ ఇంధన అవసరాలకు సుమారు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన 1,575 మిలియన్ బారెల్స్ ముడి చమురు దిగుమతి చేసుకునే ఇండియాకు సుమారు 1.6 బిలియన్ డాలర్లు (రూ .10 వేల కోట్లు) పెంచుతుందని కేర్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరగడంతో గృహాల వాస్తవిక ఆదాయాలు తగ్గిపోవచ్చని, అందువల్ల వినియోగదారుడి డివిజనల్ డిమాండ్ దెబ్బతింటుందని నోమురా విశ్లేషించింది. ఇదే అంశంపై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికె విజయకుమార్ మాట్లాడుతూ ఆర్బీఐ 2018 సంవత్సరానికి 68డాలర్లుగా అంచనావేయగా ముడి చమురు ధర ఏప్రిల్ నుంచి పది డాలర్ల మేర పెరిగిందన్నారు. బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు 80 డాలర్ల వద్ద ఉందనీ, ముడి చమురు ధరల్లో ప్రతి 10 డాలర్లు పెంపు, దేశంలో ద్రవ్యోల్బణం 10 బీపీఎస్ పాయింట్ల మేర పెరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో దేశీయ కరెన్సీపై మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. దిగుమతుల బిల్లును డాలర్లలో చెల్లించాల్సి ఉండటంతో రూపాయి మరింత బలహీనపడే అవకాశముంది. మరోవైపు ఎగుమతులకంటే దిగుమతుల బిల్లే ఎక్కువ కావడం కూడా డాలర్లకు డిమాండుకు జోష్‌నిస్తుంది. ప్రధానంగా ముడిచమురు, డాలరు బలపడటం వంటి అంశాలు దేశ ఆర్థిక లోటుకు కారణమవుతుంది. అటు చమురు ధరల పెరుగుదలతో దేశీయంగా పెట్రోల్ ధరలు పెంపు అనివార్యం. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మరోపక్క ఏప్రిల్ తరువాత డాలరుతో మారంకలో రూపాయి ఏకంగా రూ. 3 పతనం కావడం గమనార్హం. ఏప్రిల్‌లో డాలరుతో మారకంలో రూపాయి 65 స్థాయిలో ట్రేడ్ కాగా... ప్రస్తుతం రూపాయి 68 దిగువకు పతనమైంది. కార్పొరేట్ లాభాల మార్జిన్లు భారీగా క్షీణించడంతో విమానయాన, పెయింటింగ్ , టైర్లు, ప్లాస్టిక్లు, రసాయనాలు, ఎరువులు, మైనపు, రిఫైనింగ్, పాదరక్షలు, సిమెంట్, లాజిస్టిక్స్ పరిశ్రమలను చమురు ధరల సెగ తాకనుంది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ఆయా ఉత్పత్తుల ధరలను భారీగా ప్రభావితం చేయనుంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతాయని విజయ్‌కుమార్ తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్ దగ్గరుంటే మెదడు మటాష్!
లండన్: స్మార్ట్ఫోన్లకు అలవాటైన వారు ఒక్కరోజు కూడా వాటిని విడిచి ఉండలేరన్న విషయం తెల్సిందే. అయితే స్మార్ట్ఫోన్లను దగ్గరుంచుకున్న వారి జ్ఞానశక్తి కూడా అవిలేని వారితో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందట. ఫోన్ ఆన్‌లో ఉందా, ఆఫ్‌లో ఉందా? అన్న అంశంతో సంబంధం లేకుండా వారి జ్ఞానశక్తి తగ్గుతుందని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లోని మ్యాక్కోంబ్స్ బిజినెస్ స్కూల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రియన్ వార్డు తెలిపారు. ఆయన తన శిష్యులతో కలసి రెండు బృందాలపై వేర్వేరుగా జరిపిన పరీక్షల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. మొదటి బృందంగా ఆయన 800 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఎంపిక చేసుకున్నారు. వారిని మూడు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ ఫోన్లను పక్క రూములో, రెండో గ్రూపు ఫోన్లను టేబుల్‌పైనా, మూడో గ్రూపు ఫోన్లను జేబుల్లోగానీ, తమ బ్యాగుల్లోగాని పెట్టుకోమని చెప్పారు. అన్ని ఫోన్లను సైలెన్స్ మోడ్‌లో ఉంచాల్సిందిగా కోరారు. వారందరికి మనసును బాగా లగ్నం చేయాల్సిన పరీక్షను కంప్యూటర్ ద్వారా నిర్వహించారు. పక్క రూములో ఫోన్లను భద్రపర్చినవారు, టేబుళ్లపై ఫోన్లను పెట్టుకున్న వారికన్నా బాగా ఫలితాలు సాధించారు. ఇక టేబుళ్లపై ఫోన్లు పెట్టుకున్నవారు జేబుల్లో ఫోన్లు పెట్టుకున్నవారికన్నా బాగా రాణించారు. ఆ తర్వాత స్మార్ట్ఫోన్లను బాగా ఉపయోగించేవారిని ఎంపిక చేసి వారికి కూడా ఇదే సరళిలో పరీక్ష నిర్వహించారు. కొందరిని ఫోన్లను పక్కరూములో పెట్టించారు, కొందరి ఫోన్లను టేబుల్‌పై పెట్టించారు. మరి కొందరి ఫోన్లను స్విచాఫ్ చేయించారు. ఫోన్లు ఆఫ్ ఉందా, ఆన్‌లో ఉందా ? అన్న సంబంధం లేకుండా ఎక్కువగా ఫోన్ ఉపయోగించేవాకి చాలా తక్కువ మార్కులు, తక్కువగా ఫోన్ ఉపయోగించేవారికి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఫోన్ ఆఫ్‌లో ఉందా, ఆన్‌లో ఉందా ? అన్న అంశంతో సంబంధం లేకుండా ఫోన్లు దగ్గరుంటే చాలు జ్ఞానశక్తి తగ్గుతుందని పరిశోధక బృందం తేల్చింది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య 2014 సంవత్సరంలో 157 కోట్ల మంది ఉండగా, 2017 సంవత్సరానికి వారి సంఖ్య 232 కోట్లకు చేరుకుంది. 2020 నాటికి 287 కోట్లకు చేరుకుంటుందన్నది ఒక అంచనా. -
నోట్ల రద్దుపై రగడ
-
ఆదాయంపై ఎత్తు, బరువు ప్రభావం
లండన్ః పర్సనాలిటీని బట్టే ఫలితాలుంటాయంటున్నారు తాజా పరిశోధకులు. పొట్టిగా ఉన్న పురుషులు, లావుగా ఉన్న మహిళలపై సామాజిక, ఆర్థిక, విద్య, వృత్తి పరమైన ప్రభావాలు చూపుతాయంటున్నారు అధ్యయనకారులు. అంతేకాదు వారి ఆదాయంపై కూడా శరీరాకృతి ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగల్గుతారంటారు. దానికి వ్యక్తిత్వం, భావజాలం కూడా, ఓక్కోసారి సహకరిస్తుంటాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తెలిపాయి. అయితే మాట తీరు మాత్రమే కాదు.. పొట్టి పొడుగులు, లావు సన్నాలు కూడా వారి సామాజిక జీవితంపై ప్రభావం చూపిస్తాయంటున్నాయి తాజా అధ్యయనాలు. ఒక వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితులతోపాటు... ముఖ్యంగా మహిళల శరీర ద్రవ్యరాశి సూచిక అనేక అంశాలు నిర్ణయించడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్తున్నారు బ్రిటన్ ఎక్సెటర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తిమోతి ఫ్రేలింగ్. తమ అధ్యయనాలను బిఎంజె జర్నల్ లో నివేదించారు. వ్యక్తి సామాజిక ఆర్థిక స్థితికి కారణభూతమౌతున్న బాడీమాస్ ఇండెక్స్ పాత్రను పరిశోధకులు పరీక్షించారు. బ్రిటన్ బయోబ్యాంక్ డేటాబేస్ లోని 40 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు లక్షా ఇరవై వేలమంది జీవ సంబంధ సమాచారాన్ని సేకరించిన అధ్యయనకారులు... మెండెల్ ర్యాండమైజేషన్ గా పిలిచే సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల ఎత్తు, శరీర ద్రవ్యరాసి సూచికల ప్రభావాలు, జన్యు పరమైన వైవిధ్యాలను విశ్లేషించారు. పాఠశాల, డిగ్రీస్థాయి విద్య ముగిసిన సమయం, ఉద్యోగం, తరగతి, వార్షిక కుటుంబ ఆదాయం, సామాజిక లేమి వంటి ఐదు ప్రధానాంశాలతో పురుషులు, మహిళలపై విడివిడిగా పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా స్థూలకాయులైన మహిళలపై సామాజిక, ఆర్థిక ప్రభావం పడుతోందని, అదే పొడుగ్గా ఉండే పురుషులకు అనుకూలంగా ఉన్నట్లు పరిశోధనల్లో నిర్థారించారు.