భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. చందమామ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ని సురక్షితంగా దించిన నాల్గో దేశంగా ఘనత సాధించింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజుల పాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా ముగించింది. ఈ విజయం దేశ ప్రజలను ఆనందోత్సాహల్లో ముంచెత్తింది.
ప్రతి ఇంటా ఓ పండుగను తీసుకొచ్చింది ఈ విజయం. ఇక ఖగోళ శాస్త్ర పరంగా అంతరిక్షంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి కుతూహలంగానే ఉంటుంది. అందులోనూ మనం చిన్నప్పటి నుంచి మామ అని ఇష్టంగా పిలుచుకును చంద్రుడు గురించి ఐతే ఆ జిజ్ఞాస మరింత ఎక్కువగా ఉంటుంది. చంద్రుడిపై మచ్చ ఉందని ఏవేవో చందమమా కథలను చెప్పుకునేవాళ్లం. అలాంటి చంద్రుడు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసుకుందామా!.
చంద్రుని గురించి పౌరాణికంగా చాలా విషయాలను కథలు కథలుగా తెలుసుకున్నాం. పురాణాల ప్రకారం చంద్రుడుని మనః కారకుడని అంటారు. చంద్రుడు మనిషి మససుపై అధిక ప్రభావం చూపుతాడని, చంద్రుని ఆధారంగానే మనిషి ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. మనిషి నిద్రపై కూడా చంద్రుని ప్రభావం ఉంటుందని అంటారు. మానసిక ఆరోగ్య దగ్గర నుంచి శారీరకంగా.. గుండె ఆరోగ్యం వరకు ఆయన ప్రభావం ఉంటుందని అంటారు.
పౌర్ణమి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..
పౌర్ణమి మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పర్యావరణ కారకాలు వ్యక్తుల మానసిక కల్లోలానికి కారణమవుతాయని అందువల్ల వారు నిరాశకు లేదా ఉన్మాదానికి లోనై అకృత్యాలకు పాల్పడతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భావోద్వేగాలకు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి అయిన "బైపోలార్ డిజార్డర్" వ్యక్తులపై పరిశోధనలు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ వ్యక్తులు నిద్రలోని మార్పులకు, తరుచుగా కనిపించే మాంద్య లక్షణాల నుంచి ఉన్నాద లక్షణాలకు మారడంపై చంద్రుని ప్రభావం ఉన్నట్లు తేలింది. అలాగే బైపోలార్ డిజార్డర్ ఉన్న ఓ స్త్రీపై మూన్ మూడ్ కనెక్షన్ కోసం లైట్ థెరఫీని ఉపయోగించి కొన్ని మందుల మార్చడం ద్వారా చంద్రుని ప్రభావాల ఆధారంగా చికిత్స చేయవచ్చని వెల్లడైందని మాలిక్యులర్ సెక్రియాట్రిక్ జర్నల్‌లో తెలిపారు శాస్త్రవేత్తలు.
నిద్రను ఎలా ప్రభావితం చేస్తాడు?
పౌర్ణమి రోజుల్లో చాలామంది వ్యక్తులు సాధారణ సమయం కంటే ఆలస్యంగా నిద్రపోతారని అంటున్నారు నిపుణులు. పౌర్ణమికి ముందు రోజుల నుంచే ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుందని చెబుతున్నారు. నిద్రపోవడం అనేది పౌర్ణమితో ముడిపడి ఉందని పరిశోధనల్లో తేలింది కూడా. ఐతే స్లీప్ లేటెన్సీ..నిద్రలోకి జారుకోవడం లేదా మొదటి నిద్రలోనే గాఢ నిద్రలోకి వెళ్లడం అనేది కూడా ఆల్కహాల్ లేదా కొన్ని రకాల మందుల ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది. .
పౌర్ణమి, అమావాస్య సమయంలో హృదయ స్పందన రేటు, రక్తపోటు తగ్గదలను గమనించినట్లు పరిశోధన పేర్కొంది. పౌర్ణమి, అమావాస్య తిథుల్లో తొందరగా రక్తపోటు సాధారణ స్థాయికి తిరిగి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. బహుశా అందువల్లే కాబోలు పెద్దలు ఈ రోజు పౌర్ణమి ఇవే చేయాలి. అమావాస్యని అలాంటివి చేయకూడదు వంటి నియమాలు పెట్టారు. ముందు జాగ్రత్తతోనే నియమాలు పెడితే మనం చాదస్తంగా కొట్టిపారేస్తున్నాం. సైన్సుపరంగా వారు పెట్టినవి నిజమని తేలేంత వరకు అంగీకరించం మనం.
గమనిక: ఈ కథనం చంద్రుని శక్తి గురించి కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. సైన్సుపరంగా రుజువైందని తెలియడం కోసం. దీన్ని ఆధారంగా మీరు ఔషధాలను ఉపయోగించడం లేదా ప్రయోగాలు చేయడం వంటి పనులు చేయొద్దు. ఏదైనా వైద్యులు, నిపుణులు సలహాల మేరకే పాటించాలి. ఇది కేవలం అవగాహన కల్పించాలనే ఉద్దేశం మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment