Physical and mental growth
-
ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు?
ఆరోగ్యాన్ని నిర్ణయించేది ప్రధానంగా మనం తీసుకునే ఆహారమే. అదే మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల మన ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయంపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు నిపుణలు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో వారి మాటల్లోనూ చూద్ధామా..!.చాలామందికి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే ఆలోచన వస్తుంటుంది. కానీ అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు పాటించారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో సవివరంగా చూద్దామా..!శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల ఆహారం తినాలి.ఆకలికి, హిత, మిత ఆహారం అత్యంత ఆరోగ్యదాయకం.వృక్ష సంభందిత ఆహారాలు ఆరోగ్య ఆనంద దాయకమయినవి.ఆకుకూరలు, పళ్ళు, ధాన్యాలు, పప్పులు, విత్తనాలు వంటి సార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.పచ్చి కూరగాయలు, పళ్ళలోను వివిధ రంగురంగుల కూరగాయలను తినాలి. అవి విటమిన్లు, ఖనిజ లవణాలతో నిండిఉంటాయి.కొవ్వులు, ఉప్పు, చక్కెరలు తక్కువ ఉండే ఆహారాలను ఎంచుకోవాలి.ఎక్కువ పీచు పదార్థాలను తీసుకోవాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.శరీర కార్యకలాపాలకు అనుగుణంగా నిర్జలీకరణ రాకుండా సరిపడా తగినంత నీరు త్రాగాలిఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్, ఫ్రిజ్డ్, ఫ్రై ఆహారాలను తప్పించాలి లేదా తగ్గించాలి.పాలు, మాంసం, పప్పులు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తీసుకోవాలి.తరచుగా వేర్వేరు రకాల ఆహారాలను మార్చుకుంటూ తినాలి. వైవిధ్యంగా తినడం మంచిది. కనీసం వారానికోసారి ఉపవాసం ఉండటం మంచింది. అలాగే ఒకరోజు మొత్తం ద్రవపదార్థాలపై ఆధారపడటం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం గురించి అవగాహన కోసమే ఇచ్చాం. పాటించే ముందుకు నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. (చదవండి: పార్టనర్‌కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?) -
"చంద్రుడు" ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసా!
భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. చందమామ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ని సురక్షితంగా దించిన నాల్గో దేశంగా ఘనత సాధించింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజుల పాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా ముగించింది. ఈ విజయం దేశ ప్రజలను ఆనందోత్సాహల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా ఓ పండుగను తీసుకొచ్చింది ఈ విజయం. ఇక ఖగోళ శాస్త్ర పరంగా అంతరిక్షంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి కుతూహలంగానే ఉంటుంది. అందులోనూ మనం చిన్నప్పటి నుంచి మామ అని ఇష్టంగా పిలుచుకును చంద్రుడు గురించి ఐతే ఆ జిజ్ఞాస మరింత ఎక్కువగా ఉంటుంది. చంద్రుడిపై మచ్చ ఉందని ఏవేవో చందమమా కథలను చెప్పుకునేవాళ్లం. అలాంటి చంద్రుడు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసుకుందామా!. చంద్రుని గురించి పౌరాణికంగా చాలా విషయాలను కథలు కథలుగా తెలుసుకున్నాం. పురాణాల ప్రకారం చంద్రుడుని మనః కారకుడని అంటారు. చంద్రుడు మనిషి మససుపై అధిక ప్రభావం చూపుతాడని, చంద్రుని ఆధారంగానే మనిషి ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. మనిషి నిద్రపై కూడా చంద్రుని ప్రభావం ఉంటుందని అంటారు. మానసిక ఆరోగ్య దగ్గర నుంచి శారీరకంగా.. గుండె ఆరోగ్యం వరకు ఆయన ప్రభావం ఉంటుందని అంటారు. పౌర్ణమి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. పౌర్ణమి మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పర్యావరణ కారకాలు వ్యక్తుల మానసిక కల్లోలానికి కారణమవుతాయని అందువల్ల వారు నిరాశకు లేదా ఉన్మాదానికి లోనై అకృత్యాలకు పాల్పడతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భావోద్వేగాలకు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి అయిన "బైపోలార్ డిజార్డర్" వ్యక్తులపై పరిశోధనలు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వ్యక్తులు నిద్రలోని మార్పులకు, తరుచుగా కనిపించే మాంద్య లక్షణాల నుంచి ఉన్నాద లక్షణాలకు మారడంపై చంద్రుని ప్రభావం ఉన్నట్లు తేలింది. అలాగే బైపోలార్ డిజార్డర్ ఉన్న ఓ స్త్రీపై మూన్ మూడ్ కనెక్షన్ కోసం లైట్ థెరఫీని ఉపయోగించి కొన్ని మందుల మార్చడం ద్వారా చంద్రుని ప్రభావాల ఆధారంగా చికిత్స చేయవచ్చని వెల్లడైందని మాలిక్యులర్ సెక్రియాట్రిక్ జర్నల్‌లో తెలిపారు శాస్త్రవేత్తలు. నిద్రను ఎలా ప్రభావితం చేస్తాడు? పౌర్ణమి రోజుల్లో చాలామంది వ్యక్తులు సాధారణ సమయం కంటే ఆలస్యంగా నిద్రపోతారని అంటున్నారు నిపుణులు. పౌర్ణమికి ముందు రోజుల నుంచే ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుందని చెబుతున్నారు. నిద్రపోవడం అనేది పౌర్ణమితో ముడిపడి ఉందని పరిశోధనల్లో తేలింది కూడా. ఐతే స్లీప్ లేటెన్సీ..నిద్రలోకి జారుకోవడం లేదా మొదటి నిద్రలోనే గాఢ నిద్రలోకి వెళ్లడం అనేది కూడా ఆల్కహాల్ లేదా కొన్ని రకాల మందుల ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది. . పౌర్ణమి, అమావాస్య సమయంలో హృదయ స్పందన రేటు, రక్తపోటు తగ్గదలను గమనించినట్లు పరిశోధన పేర్కొంది. పౌర్ణమి, అమావాస్య తిథుల్లో తొందరగా రక్తపోటు సాధారణ స్థాయికి తిరిగి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. బహుశా అందువల్లే కాబోలు పెద్దలు ఈ రోజు పౌర్ణమి ఇవే చేయాలి. అమావాస్యని అలాంటివి చేయకూడదు వంటి నియమాలు పెట్టారు. ముందు జాగ్రత్తతోనే నియమాలు పెడితే మనం చాదస్తంగా కొట్టిపారేస్తున్నాం. సైన్సుపరంగా వారు పెట్టినవి నిజమని తేలేంత వరకు అంగీకరించం మనం. గమనిక: ఈ కథనం చంద్రుని శక్తి గురించి కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. సైన్సుపరంగా రుజువైందని తెలియడం కోసం. దీన్ని ఆధారంగా మీరు ఔషధాలను ఉపయోగించడం లేదా ప్రయోగాలు చేయడం వంటి పనులు చేయొద్దు. ఏదైనా వైద్యులు, నిపుణులు సలహాల మేరకే పాటించాలి. ఇది కేవలం అవగాహన కల్పించాలనే ఉద్దేశం మాత్రమే. (చదవండి: మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్‌లు ఏంటో తెలుసా!) -
పద్నాలుగేళ్ల పసిపాప!
అంతుచిక్కని వ్యాధితో నిలిచిపోయిన ఎదుగుదల మంచానికే పరిమితం తల్లడిల్లుతున్న మాతృమూర్తి అందని పింఛను, ప్రభుత్వ సాయం గాంధీనగర్ : విధి ఆ కుటుంబంపై చిన్నచూపు చూసింది. భర్త గుండెపోటుతో మరణించాడు. చిన్న కూతురు సుమనాగవల్లి అంతుచిక్కని వ్యాధితో పద్నాలుగేళ్లుగా మంచానికే పరిమితమైంది. శారీరక, మానసిక ఎదుగుదల లేదు. బాధ కలిగితే ఏడవడం తప్ప అమ్మా అని పిలవలేని పరిస్థితి. ఎవరన్నా పలకరిస్తే కన్నెత్తి చూడలేదు. ఆస్తులు కోల్పోయి, భర్తను పోగొట్టుకుని కూతురి దీనస్థితి చూసి తల్లడిల్లుతున్న ఓ మాతృమూర్తి మనోవేదన ఇది. వాంబేకాలనీకి చెందిన పోలేపల్లి విజయ్‌కుమార్, రమాదేవిలకు ఇద్దరు ఆడపిల్లలు. అమృతవల్లి, సుమనాగవల్లి. చిన్నప్పుడే సుమనాగవల్లి ఊయలలోంచి జారిపడింది. వైద్యులకు చూపించారు. ఏమీ కాలేదన్నారు. ఆ తర్వాత మూడు నెలలకు పాపకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఫిట్స్.. అలా కోమాలోకి వెళ్లింది. అంతే ఆ కుటుంబంలో సంతోషం ఆవిరైపోయింది. పిల్లల వైద్యులందరికీ చూపినా ఫలితం దక్కలేదు. ఆస్తులన్నీ విక్రయం ఈ క్రమంలో ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. నిలువ నీడనిచ్చే ఇంటిని అమ్ముకున్నారు. నాగవల్లికి ద్రవాహారం ఇస్తూ కంటికి రెప్పలా కాపడుకుంటూ వస్తున్నారు. ఇంతలో రమాదేవి భర్త గుండెపోటుతో మరణించాడు. ఇక కష్టాలు ప్రారంభమయ్యాయి. పెద్ద కూతుర్ని మున్సిపల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివించారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేర్పించారు. రమాదేవి ఇంటి వద్దే చాక్లెట్లు, బిస్కెట్లు విక్రయిస్తూ వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. నాగవల్లికి మందులు, ఇంటి అద్దెలు...ఇలా ఒక్కొక్కటి భారమైపోతున్నాయి. చెన్నైలో వైద్యం చేయిస్తే నయమవుతుందని వైద్యులు సూచించారు. డబ్బులు సమకూర్చుకునేందుకు బయటకు వెళ్లాలంటే కూతురి సంరక్షణ కష్టమవుతుంది. అందుకే ఆమె ఇంట్లోనే ఉండాల్సివచ్చింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ప్రభుత్వం సాయం చేయలేదు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయం అందిస్తే చెన్నై వెళ్లి వైద్యం చేయించుకుంటానని రమాదేవి కన్నీరు పెట్టుకుంటున్నారు. పింఛను రావడంలేదు వితంతు పింఛను మంజూరు కాలేదు. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఆధార్‌కార్డు లేదని, రేషన్ కార్డులేదని కొర్రీలు వేస్తున్నారు. నా కూతురికి 90 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉన్నా వికలాంగుల పింఛను రావడంలేదు. కనీసం అదన్నా ఇస్తే బిడ్డకు అవసరమైన ఆహారం సమకూర్చుకుంటా. -రమాదేవి