ఆరోగ్యాన్ని నిర్ణయించేది ప్రధానంగా మనం తీసుకునే ఆహారమే. అదే మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల మన ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయంపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు నిపుణలు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో వారి మాటల్లోనూ చూద్ధామా..!.
చాలామందికి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే ఆలోచన వస్తుంటుంది. కానీ అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు పాటించారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో సవివరంగా చూద్దామా..!
శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల ఆహారం తినాలి.
ఆకలికి, హిత, మిత ఆహారం అత్యంత ఆరోగ్యదాయకం.
వృక్ష సంభందిత ఆహారాలు ఆరోగ్య ఆనంద దాయకమయినవి.
ఆకుకూరలు, పళ్ళు, ధాన్యాలు, పప్పులు, విత్తనాలు వంటి సార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
పచ్చి కూరగాయలు, పళ్ళలోను వివిధ రంగురంగుల కూరగాయలను తినాలి. అవి విటమిన్లు, ఖనిజ లవణాలతో నిండిఉంటాయి.
కొవ్వులు, ఉప్పు, చక్కెరలు తక్కువ ఉండే ఆహారాలను ఎంచుకోవాలి.
ఎక్కువ పీచు పదార్థాలను తీసుకోవాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
శరీర కార్యకలాపాలకు అనుగుణంగా నిర్జలీకరణ రాకుండా సరిపడా తగినంత నీరు త్రాగాలి
ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్, ఫ్రిజ్‌డ్, ఫ్రై ఆహారాలను తప్పించాలి లేదా తగ్గించాలి.
పాలు, మాంసం, పప్పులు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తీసుకోవాలి.
తరచుగా వేర్వేరు రకాల ఆహారాలను మార్చుకుంటూ తినాలి. వైవిధ్యంగా తినడం మంచిది. కనీసం వారానికోసారి ఉపవాసం ఉండటం మంచింది. అలాగే ఒకరోజు మొత్తం ద్రవపదార్థాలపై ఆధారపడటం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం గురించి అవగాహన కోసమే ఇచ్చాం. పాటించే ముందుకు నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం.
(చదవండి: పార్టనర్‌కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?)
Comments
Please login to add a commentAdd a comment