Hyderabad: నుమాయిష్‌ వాయిదా… ఎప్పటి నుంచంటే! | Hyderabad Numaish Has Been Postponed To January 3 2025 | Sakshi
Sakshi News home page

Hyderabad: నుమాయిష్‌ వాయిదా… ఎప్పటి నుంచంటే!

Published Sun, Dec 29 2024 8:43 PM | Last Updated on Sun, Dec 29 2024 8:45 PM

Hyderabad Numaish Has Been Postponed To January 3 2025

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌)కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్‌ ప్రారంభ తేదీ వాయిదా పడింది.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌)కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్‌ ప్రారంభ తేదీ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్‌ 3వ తేదీకి వాయిదా పడింది. రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. 3న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తామని తెలిపారు. 46 రోజుల పాటు వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగుతుంది. నిజాం కాలంలో 1938లో ప్రారంభమైన నుమాయిష్‌ను తిలకించేందుకు నగరవాసులే కాక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తారు.

2200 స్టాల్స్‌ ఏర్పాటు
ఎగ్జిబిషన్‌లో 2200 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులు ఈ స్టాళ్లల్లో కొలువుదీరనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య, ఆరోగ్య, కార్మిక, సమాచార, ఆర్‌బీఐ, అటవీశాఖ, జైళ్ల శాఖలతో పాటు పలు ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తాయి. జనవరి 3న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్‌లో రౌండ్‌ స్టాళ్లను తొలగించి స్క్వైయర్‌ స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.

సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ..
ఎగ్జిబిషన్‌ నలుమూలలా 160 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్‌ డిటెక్టర్లతో అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. సందర్శకులను మధ్యాహ్నం 3 గంట నుండి రాత్రి 10.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ ఏడాది ఎంట్రీ ఫీజును రూ.10 పెంచారు. గతంలో రూ.40గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.50 గా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement