జీవితంపై కోటి ఆశలతో కలలుగనేవారు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. అలాంటివారే విజయాలను అందుకుంటారు. దీనిని పలువురు రుజువు చేశారు. ఆ కోవలోకే వస్తాడు యూపీలోని అమేథీకి చెందిన ఉత్కర్ష్ శుక్లా. ఒకనాడు తనకు చదువుకునే పరిస్థితి లేకపోయినా పట్టుదలతో అనుకున్నది సాధించి చూపాడు.
యూపీలోని అమేథీలో గల రాజీవ్ గాంధీ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌లో ఉత్కర్ష్ శుక్లా బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు ఉత్కర్ష్ శుక్లా డిగ్రీతోపాటు రాష్ట్రపతి బంగారు పతకం కూడా అందుకున్నాడు. చిన్నప్పటి నుండి ఉత్కర్ష్‌కు చదువులో ఘన విజయం సాధించాలనే తపనతో ఉండేవాడు. ఉత్కర్ష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి.
బీటెక్ పూర్తి చేసిన ఉత్కర్ష్ ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్‌లో గ్రేడ్ వన్ అధికారిగా ఎంపికయ్యారు. 20 ఏళ్ల వయసులో ఉత్కర్ష్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాడు. ఉత్కర్ష్ మీడియాతో మాట్లాడుతూ తాను సాధించిన విజయం తనకు ఎంతో ఆనందమిస్తున్నదని చెబుతూ, తాను గతంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలిపాడు. కరోనా సమయంలో పుస్తకాలు దొరక్క చదువుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, పోటీ పరీక్షల ప్రపరేషన్‌కు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే పట్టువదలక పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించానని అన్నాడు.
ఇది కూడా చదవండి: ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన
Comments
Please login to add a commentAdd a comment