ఈజీ క్యాచ్‌లు విడిచిపెట్టిన జైశ్వాల్‌.. కోపంతో ఊగిపోయిన రోహిత్‌ | Yashasvi Jaiswal Drops Three Easy Catches On Day 4; Rohit Sharmas frustrated | Sakshi
Sakshi News home page

ఈజీ క్యాచ్‌లు విడిచిపెట్టిన జైశ్వాల్‌.. కోపంతో ఊగిపోయిన రోహిత్‌

Published Sun, Dec 29 2024 7:48 PM | Last Updated on Sun, Dec 29 2024 7:51 PM

Yashasvi Jaiswal Drops Three Easy Catches On Day 4; Rohit Sharmas  frustrated

మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. నాలుగో రోజు ఆటలో తొలి రెండు సెషన్స్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తే.. ఆఖరి సెషన్‌లో ఆసీస్ అద్బుతమైన కమ్‌బ్యాక్ చేసింది. 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను టెయిలాండర్లు నాథన్ లియోన్(41 నాటౌట్‌), స్కాట్ బోలాండ్(10 నాటౌట్‌) విరోచిత పోరాటం కనబరిచారు.

ఆఖరి వికెట్‌కు వీరిద్దరూ 55 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 333 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

జైశ్వాల్‌పై రోహిత్ ఫైర్‌..
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. మూడు క్యాచ్‌లను జైశ్వాల్ జారవిడిచాడు. తొలుత  2 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను యశస్వి విడిచిపెట్టాడు. అయితే ఆ క్యాచ్ అందుకోవడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత మాత్రం లబుషేన్‌, కమ్మిన్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను మాత్రం ముంబైకర్‌ నేలపాలు చేశాడు.

 ఆసీస్ స్కోర్ 99/6 ఉన్నప్పుడు.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఓ బంతి లబుషేన్ బ్యాట్‌కు తాకి గల్లీ పొజిషేన్‌లో ఉన్న జైశ్వాల్ చేతికి వెళ్లింది. అయితే ఆ బంతిని అందుకోవడంలో యువ ఆటగాడు విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ..జైశ్వాల్‌పై సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
చదవండి: WTC 2023-25: పాకిస్తాన్‌ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement