ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్-2024కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం(డిసెంబర్ 29) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది.
ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన అర్ష్‌దీప్ 7.49 ఏకనామీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
మొత్తం 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు.
ఈ ఏడాది టీ20ల్లో బాబర్ పర్వాలేదన్పించాడు. 23 ఇన్నింగ్స్‌లో 738 పరుగులతో పాక్ తరపున లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా సికిందర్ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్‌లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 15 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు చేశాడు.
బుమ్రాకు నో ఛాన్స్..
కాగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఎనిమిది మ్యాచ్‌లలో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. అయినప్పటికి బుమ్రాను టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment