మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా టీమిండియా ముందు 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఉంచనుంది. ప్రస్తుతం ఆ జట్టు 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఓ వికెట్ మాత్రమే ఉంది. నాథన్ లయోన్ (16), స్కాట్ బోలాండ్ (8) టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇవాళ మరో 16 ఓవర్ల ఆట మిగిలి ఉంది.
ఛేజింగ్ విషయానికొస్తే.. మెల్‌బోర్న్ మైదానంలో గడిచిన 70 ఏళ్లలో ఛేజింగ్ చేసిన అత్యధిక స్కోర్ 258. ఆసీస్ ఇప్పటికే 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ 300 ప్లస్ టార్గెట్‌ను ఛేదిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ విజయవంతంగా ఛేదించిన లక్ష్యాలను చూస్తే.. టీమిండియా కేవలం మూడు పర్యాయాలు మాత్రమే టెస్ట్ క్రికెట్‌లో 300 ప్లస్ స్కోర్‌ను ఛేదించింది. 1976లో వెస్టిండీస్‌పై 406 పరుగులు.. 2008లో ఇంగ్లండ్‌పై 387.. 2021లో ఆస్ట్రేలియాపై 329 పరుగుల లక్ష్యాలను విజయవంతగా భారత్ ఛేదించింది.
గణాంకాలు, గత చరిత్ర ఆధారంగా చూస్తే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం అంత ఈజీ కాదు. ఏదైన అద్భుతం జరిగి భారత టాపార్డర్ ఇరగదీస్తే ఈ మ్యాచ్ టీమిండియా సొంతం అవుతుంది. పిచ్ కూడా చివరి రోజు బ్యాటర్లకు అంతగా అనుకూలించకపోవచ్చు. ఒకవేళ అనుకూలించినా 300 ప్లస్ టార్గెట్‌ను ఛేజ్ చేసేంత సీన్ ఉండకపోవచ్చు.
స్కోర్ల విషయానికొస్తే.. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment