భారత్, ఆస్ట్రేలియా ఆ మధ్య మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట నువ్వా నేనా అన్నట్టు సాగింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక దశలో కేవలం పదకొండు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ ని ఆధిపత్యాన్ని అందించాడు. లంచ్ విరామం తర్వాత బుమ్రా చెలరేగిపోయి మొదట ఆస్ట్రేలియా తరుఫున ఈ సిరీస్ లో అత్యధిక స్కోర్ సాధించిన ట్రావిస్ హెడ్ ని ఒక పరుగుకే పెవిలియన్ పట్టించాడు.
దీంతో బుమ్రా తన టెస్ట్ కెరీర్ లో రెండు వికెట్ల రికార్డు ని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా అతి తక్కువ సగటుతో ఈ రికార్డు ని నెలకొల్పడం విశేషం. బుమ్రా 20.29 సగటు తో కేవలం 44 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మాల్కం మార్షల్ 20.94 సగటు తో నెలకొల్పిన రెకార్డ్ ని అధిగమించి ఈ రికార్డ్ ని సాధించడం గమనార్హం.
బుమ్రా నాలుగు బంతుల వ్యవధిలో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్షల్ ని డకౌట్ చేసాడు. బుమ్రా తన తర్వాత ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అలెక్స్ క్యారీని రెండు పరుగులకు అవుట్ చేసాడు. ఈ దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది.
మూడు క్యాచ్ లు జారవిడిచిన జైస్వాల్
అయితే భారత్ యువ బ్యాట్స్మన్ యశస్వీ జైస్వాల్ ఈ దశలో రెండు కీలకమైన క్యాచ్ లు జారవిడవడం తో ఆస్ట్రేలియా కి అదృష్టం కలిసి వచ్చింది. ఇందులో అత్యంత కీలకమైన మార్నస్ లబుషేన్ క్యాచ్ కూడా ఉండడం గమనార్హం. అప్పటికి ఇంకా తన ఖత కూడా తెరవని లబుషేన్ ఆ తర్వాత ఏకంగా 70 పరుగులు సాధించి ఆస్ట్రేలియా తరఫున ఈ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ సాధించడమే గాక కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి ఏడో వికెట్ కి 59 పరుగులు జోడించడం విశేషం.
జైస్వాల్ ఆ తరువాత స్పిన్నర్ అజయ్ జడేజా బౌలింగ్ లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్ ని కూడా జారవిడిచాడు. ఈ మూడు క్యాచ్ లు భారత్ విజయావకాశాలను దెబ్బతీసాయనడంలో సందేహం లేదు. జైస్వాల్ క్యాచ్ లను జారవిడవడం పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
అప్పటికి భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో పట్టు బిగించే పరిస్థితి లో ఉంది. అయితే లబుషేన్, కమిన్స్ లు అవుటైన అనంతరం నాథన్ లియాన్ (41 నాటౌట్) మరియు స్కాట్ బోలాండ్ (10 పరుగులతో నాటౌట్) చివరి వికెట్ కి మరో 55 పరుగులు జోడించి అజేయంగా నిలిచారు.
దీనితో ఆస్ట్రేలియా ఆధిక్యం ౩౩౩ పరుగులకి చేరుకొంది. ఆట చివరి రోజున ఇంత భారీ లక్ష్యాన్ని సాధించడం భారత్ బ్యాట్స్మెన్ కి అంత సులువు కాకపోవచ్చు. అసలే తడబడుతున్న భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ చివరి రోజున ఎలా రాణిస్తారో చూడాలి.
గత వారం బ్రిస్బేన్‌లో జరిగిన డ్రా తర్వాత భారత్ యొక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల శాతం 57.29 నుండి 55.88 కి పడిపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారధ్యంలోని భారత్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో మూడవ స్థానంలో ఉంది.
ఆదివారం సెంచూరియన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా (63.67) లార్డ్స్‌లో వచ్చే ఏడాది లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌లో తమ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (58.89) మరియు దక్షిణాఫ్రికా (63.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టెస్టుల్లో గెలవని పక్షంలో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు తక్కువనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment