కొత్తమాజేరు విషజ్వరాల బాధితుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న ధర్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించే విధంగా ఉందని వైఎస్ఆర్ సీపీ గన్నవరం ఇన్ఛార్జ్ గన్నవరం దుట్టా రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ జ్వరంతో బాధపడుతున్నారని అన్నారు. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు.