kottamajeru
-
ఒమర్‌ది కొత్త మాజేరే
♦ చిన్నాపురంలో పుట్టి పెరిగి హైదరాబాద్‌కు వెళ్లిన సుబ్రహ్మణ్యం ♦ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ♦ పని కోసం వెళ్లి ఐసిస్‌కే సానుభూతిపరుడిగా మారిన వైనం చల్లపల్లి (అవనిగడ్డ): కొనకళ్ల సుబ్రహ్మణ్యం.. అలియాస్ ఒమర్.. జాతీయ స్థాయిలో చల్లపల్లి మండలానికి చెడ్డపేరు తెచ్చిన యువకుడు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు అనుకూలంగా పని చేస్తూ, శుక్రవారం పోలీసులకు చిక్కిన సుబ్రహ్మణ్యం ఎవరు.. ఎక్కడివాడు.. అనే ప్రశ్నకు శుక్రవారం అర్ధరాత్రి సమాధానం లభించింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో సుబ్రహ్మణ్యం గత చరిత్ర గురించి తెలుసుకునేందుకు పోలీసులు జల్లెడ పట్టారు. పోలీసులు ఎట్టకేలకు చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరులో సుబ్రహ్మణ్యం మూలాలు కనుగొన్నారు. అత ని తల్లిదండ్రులు కొనకళ్ల వెంకట నరసింహారావు దంపతులను అదుపులోకి తీసుకుని హుటాహుటిన అవనిగడ్డ డీఎస్పీ వద్దకు తరలించారు. కుటుంబ నేపథ్యం.. కొనకళ్ల సుబ్రహ్మణ్యం తాత వెంకటేశ్వర్లుది కొత్తమాజేరు గ్రామం. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దవారై న రామారావు, నాగేశ్వరరావు వివాహాలు చేసుకుని గ్రామంలోనే స్థిరపడ్డారు. చిన్న కుమారుడైన వెంకట నరసిం హారావు వివాహం అనంతరం బందరు రూరల్ మండలం చిన్నాపురం గ్రామానికి 23 ఏళ్ల కిందట ఇల్లరికం వెళ్లాడు. నరసింహారావు పెద్ద కుమారుడు ప్రస్తుతం పంజాబ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేయగా, రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యం డిగ్రీ లోనే దారి తప్పి ప్రస్తుతం పోలీసులకు చిక్కాడు. ఇంటర్‌లోనే ఇస్లాం... మచిలీపట్నంలోని రామకృష్ణ హైస్కూల్లో పదవ తరగతి చదివిన సుబ్రహ్మణ్యం... అక్కడి ముస్లిం విద్యార్థులతో కలసి ఉర్దూ మాట్లాడటం నేర్చుకున్నాడు. హైస్కూల్లో ముస్లిం మతంపై ఆసక్తి చూపేవాడని తెలుస్తోంది. అతను ఇంటర్‌లోనే ఇస్లాం స్వీకరించినట్లు తెలిసింది. ఇంటర్‌లోనే ముస్లిం సంప్రదాయం ప్రకారం సున్తీ చేయించుకున్న సుబ్రహ్మణ్యం మచిలీపట్నంలోని మదరసాలో చేరినట్లు సమాచారం. అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయి గుజరాత్, చెన్నై, బెంగళూరు మదరసాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మచిలీపట్నంలోనే డిగ్రీ చదివే సమయంలో సుబ్రహ్మణ్యం తన మాట వినడం లేదని తండ్రి నరసింహారావు మందలించాడు.అదే సమయంలో సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉంటే ఏమైపోతాడోనని భయపడిన తల్లి ప్రైవేటు ఉద్యోగం చూసుకోవా లని హైదరాబాద్‌లో ఉంటున్న తన అక్క వద్దకు పంపించారు. అక్కడ లస్సీ స్టాల్, కూల్ డ్రింక్స్ అమ్ముకుని జీవిం చిన సుబ్రహ్మణ్యం ఐఎస్ఐఎస్కు సానుభూతిపరుడిగా మారాడు. సుబ్రహ్మణ్యం ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బు కోసం ఐఎస్ఐఎస్లో చేరాడా? అనే సందేహానికీ తావు లేదు. స్వగ్రామం కొత్తమాజేరులో 4 ఎకరాల పొలం, చిన్నాపురంలో 3 ఎకరాల చెరువు, నిర్మాణంలో రెండతస్తుల భవనం ఉన్నాయి. పరువు తీశాడు తండ్రి మాట వినేవాడు కాదు. బాధ్యతగా చదువుకో బతుకు బాగుపడుతుందని చెప్పినా వినలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా మా పరువు తీశాడు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చాడు. ఇకనైనా బుద్ధిగా ఉంటాడని మా ఆశ. – కొనకళ్ల వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం తాత -
మానవత్వంలేని పాలన
మచిలీపట్నం ధర్నాలో చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం ♦ కొత్తమాజేరువన్నీ వయసు మీదపడ్డ మరణాలా? ♦ పరిహారం ఎగ్గొట్టేందుకు బాధితులను అవహేళన చేస్తారా? ♦ ప్రభుత్వ నిర్లక్ష్యమే 19మంది ప్రాణాలు తీసింది ♦ ప్రజలగోడు పట్టని ఈ పాలన ఎక్కువ రోజులుండదు.. ♦ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. వారంరోజుల్లో చెక్కులు ఇంటికి పంపిస్తాం మచిలీపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మనసు, మానవత్వం లేని ప్రభుత్వ పాలన సాగుతోందని, సీఎం చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కొత్తమాజేరు బాధిత కుటుంబాలకు వారం రోజుల్లోనే నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో విషజ్వరాలు ప్రబలి ఇటీవల చనిపోయిన 18 మంది కుటుంబాలకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ధర్నా జరిగింది. బందరు మాజీ ఎమ్మెల్యే, అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి పేర్ని నాని అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పేదల నిండు ప్రాణాలను బలి తీసుకుంటుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కొత్తమాజేరులో విషజ్వరాలు ప్రబలి ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించాలి. అన్ని మరణాలకు కారణాలేమిటి? వాటిని ఆపడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి? అని తెలుసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ గ్రామంవైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాకే చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కూడా వెళ్లలేదు. జ్వరాలతో 18మంది మరణించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసిన వెంటనే నేను కొత్త మాజేరు వెళ్లా. బాధిత కుటుంబాలను పరామర్శించా. ఆ మర్నాడే ఆ గ్రామానికి ఆరోగ్యమంత్రి వెళ్లారు. నా దగ్గరున్న సమాచారం మేరకు.... మే నెల 11న గోవర్ధన్, 12న చెక్కా నాగభూషణం, 14న కృష్ణారావు ఇలా... 11 నుంచి 14వ తేదీ మధ్య ఐదుగురు చనిపోయారు. ఆ తరువాత మొత్తం 18 మంది జ్వరాలతో చనిపోయారు. నిన్న (ఆగస్టు 24న) కూడా తిరుమలశెట్టి బాబూరావు చనిపోయాడు. దీంతో మొత్తం గ్రామంలో చనిపోయిన వారి సంఖ్య 19కి చేరింది. రెండున్నర నెలల కాలంలో 18 మంది ఎందుకు చనిపోయారో ఈ ప్రభుత్వానికి తెలుసా? గ్రామంలోని మంచినీటి చెరువు, ఓవర్‌హెడ్ ట్యాంకులో కోతులు చనిపోయి తాగునీరంతా కలుషితమై జనం చనిపోతుంటే పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏడాదికోసారి చెరువు, మూడు నెలలకోసారి వాటర్ ట్యాంకులను, ఫిల్టర్లను శుభ్రం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? సీఎం చంద్రబాబు ఇప్పటికైనా నిద్ర మేల్కొని గ్రామానికి వె ళ్లి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వకుండా... పరిహారం తప్పించుకునేందుకు మృతుల కుటుంబాలను కించపరుస్తున్నారు. జ్వరాలవల్ల ప్రజలు చనిపోతున్నారని దేశానికి తెలిస్తే పరువు పోతుందని... విషజ్వరాలవల్ల మరణించలేదు, వయసు మీదపడడం వల్లనే చనిపోయారంటూ అవహేళన చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ... ఇవన్నీ నీకు మామూలు మరణాలుగా కనిపిస్తున్నాయా?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. మోసం, మోసం, మోసం.. అన్న మూడు పదాలతోనే ఆయన అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ‘‘డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగభృతి, అందరికీ ఇళ్లు, ప్రతి ఒక్కరికీ పింఛన్లు... ఇలా మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయాక ప్రజల్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ప్రజల మరణాలపై కూడా అబద్ధాలు చెబుతున్నారు. ఆయన పాలనెంత దౌర్భాగ్యంగా ఉందంటే.. కృష్ణా డెల్టాలో నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో పోటీపడి కరెంటుకోసం శ్రీశైలం నీటిని ముందుగానే డ్రా చేసి సముద్రంలో కలిపిన పాపం నీకు (చంద్రబాబుకు) తగలకుండా పోతుందా? ఆయన పాలన ఎంత గొప్పగా ఉందంటే... ఈ రోజు ధర్నా గురించి మొన్ననే చెప్పాం. అయినా వినతిపత్రం తీసుకునేందుకు కలెక్టరుగారు లేరట. కనీసం ప్రజల గోడు వినడానికి కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేదు. అసలు వీరు మనుషులేనా? అన్న సందేహం కలుగుతుంది. ఏదిఏమైనా కొత్తమాజేరు బాధిత కుటుంబాలకు ఒక్కటే మాట. బాబు పాలన ఎక్కువ రోజులుండదు.. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మోసం చేయని, మనసున్న ప్రభుత్వమది. మీకు తోడుగా మేముంటాం. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే నష్టపరిహారం చెక్కులు మీ ఇంటికే వచ్చేస్తాయ్’’ అంటూ వైఎస్ జగన్ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లి ఆర్డీవో సాయిబాబుకు వినతిపత్రం అందజేశారు. -
చంద్రబాబు మారాలి: వైఎస్ జగన్
-
చంద్రబాబు మారాలి: వైఎస్ జగన్
మచిలీపట్నం : కొత్త మాజేరులో 18 మంది విష జ్వరాలతో చనిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విష జ్వరాల బాధితులను ఆదుకోవాలంటూ ఆయన మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే...'కొద్దిరోజుల క్రితం మాజేరు గ్రామానికి నేనే వెళ్లాను. నేను వెళ్లే సమయానికి ఆ గ్రామంలో 18మంది చనిపోయారు. 18మంది ఆ గ్రామంలో చనిపోయినా పట్టించుకోనే పరిస్థితిలో ప్రభుత్వానికి లేదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ గ్రామానికి వెళ్లి... చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించాలి. సీఎం కాదు కదా.. కనీసం ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆ గ్రామానికి వెళ్లిన పాపాన పోలేదు. జగన్ అనే వ్యక్తి వెళ్లిన తర్వాతే... ఆరోగ్య శాఖ మంత్రి వెళ్లారు. నాలుగు రోజుల తేడాతో అయిదుగురు చనిపోయారు. కనీసం చనిపోవడానికి కారణాలు కూడా తెలుసుకోలేదు. వాటర్ ట్యాంక్‌లో పడి కోతులు చనిపోయి...కుళ్లిపోయాయి. ఆ నీటినే గ్రామస్తులు తాగారు. ట్యాంక్‌లను క్లీన్ చేశారా? లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. మూడు నెలల వ్యవధిలోనే 19మంది చనిపోయినా చంద్రబాబు పట్టించుకోరు. చంద్రబాబు నిద్ర మేల్కొని చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండటం లేదు. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మామూలుగా చనిపోయారంటూ చంద్రబాబు వారిని కించపరుస్తున్నారు. -
'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?'
మచిలీపట్నం: ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. కొత్తమాజేరులో విష జ్వరాల కారణంగా 18 మంది చనిపోవడం బాధాకరమన్నారు. కామినేని మాత్రం ఎవరికీ ఏ రోగాలూ రాలేదని చెబుతున్నారని, సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని, మంత్రి రాజీనామా చేస్తారా అంటూ రాధాకృష్ణ సవాల్ చేశారు. విష జ్వరాల బాధితులకు సాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నా వేదికపై రాధాకృష్ణ మాట్లాడారు. వైఎస్ జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారని, తమ పార్టీ అధ్యక్షుడిపై అనవసర మాటలు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. దివంగత వైఎస్ఆర్, వంగవీటి రంగా అభిమానులు తిరగబడతారని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నాయకుడు ఒక్క వైఎస్ జగన్ అని రాధాకృష్ణ చెప్పారు. మరో మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ప్రాజెక్టులో ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. -
'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?'
-
ఆయన ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు..
-
ఆయన ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు..
మచిలీపట్నం: కొత్తమాజేరు విషజ్వరాల బాధితుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న ధర్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించే విధంగా ఉందని వైఎస్ఆర్ సీపీ గన్నవరం ఇన్ఛార్జ్ గన్నవరం దుట్టా రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ జ్వరంతో బాధపడుతున్నారని అన్నారు. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టే స్థితి కూడా లేదన్నారు. అసలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు ఉన్నారా లేదా అని రామచంద్రరావు ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో నిద్ర చేస్తానని చెబుతున్నారని...ఆయన ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు. మెలుకువ ఉన్నప్పుడు రంగు వేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. -
బందరులో ధర్నా చేపట్టిన వైఎస్ జగన్
-
బందరులో ధర్నా చేపట్టిన వైఎస్ జగన్
మచిలీపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్తమాజేరులో విష జ్వరాల బారినపడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. ఇప్పటివరకూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ ఈ ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ధర్నా అనంతరం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. -
బందరులో నేడు జగన్ ధర్నా
-
బందరులో నేడు జగన్ ధర్నా
కొత్తమాజేరు బాధితులకు ప్రభుత్వ సాయం అందనందుకు నిరసన సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలతో కలిసి మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ధర్నా చేపట్టనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందనందుకు నిరసనగా ఈ ధర్నా చేపడుతున్నారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం తెలిపారు. బందరులో ధర్నా అనంతరం వైఎస్ జగన్ విజయవాడకు చేరుకొని కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా... బుధవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేపట్టనున్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి భూసేకరణ పేరుతో బలవంతంగా భూములను లాక్కునేందుకు బెదిరింపులకు దిగుతున్న ప్రభుత్వ తీరుపై నిరసనగా జరగనున్న ఈ ధ ర్నాలో జగన్ పాల్గొని మాట్లాడతారు. ఇప్పటికే రాజధాని ప్రాంత భూ బాధిత రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. -
విషజ్వర బాధితుల కోసం వైఎస్ జగన్ ధర్నా
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ధర్నా చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్ ముందు వైఎస్ జగన్ ధర్నా చేస్తారని వైఎస్సార్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. కృష్ణా జిల్లా కొత్త మాజేరులో విషజ్వరాల బాధితుల్ని రాష్ట్రప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ఆయన ఆందోళన చేపడుతున్నారని చెప్పారు. పేద రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధాని కోసం వారినుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఎల్లుండి వైఎస్ జగన్ ధర్నా చేయనున్నారని చెప్పారు. -
భూ సేకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ధర్నా
-
భూ సేకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ధర్నా
హైదరాబాద్ : ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులు పాటు ధర్నా చేయనున్నారు. కృష్ణాజిల్లా కొత్తమాజేరు విషజ్వర బాధితులను ప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ఆయన ఈనెల 25న మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ మరుసటి రోజు (ఆగస్ట్ 26న) రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ధర్నా చేస్తారు. -
25న బందరులో వైఎస్ జగన్ ధర్నా
మచిలీపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన మచిలీపట్నంలో ధర్నా నిర్వహించనున్నారు. ఆ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్తమాజేరులో విషజ్వరాల బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఎలాంటి సాయం అందించకపోవటంతో బాధితుల తరఫున ఒత్తిడి తెచ్చేందుకు జగన్మోహన్రెడ్డి ఈ ధర్నా తలపెట్టారని వివరించారు. చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి 18 మంది మృతి చెందారని... మృతుల కుటుంబాలను ఈ నెల నాలుగో తేదీన కొత్తమాజేరులో పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. లేకుంటే మృతుల కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారని తెలిపారు. కొత్త మాజేరు మృతుల కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.