25న బందరులో వైఎస్ జగన్ ధర్నా | YS Jagan's to dharna on 25th at machilipatnam on kottamajeru deaths | Sakshi
Sakshi News home page

25న బందరులో వైఎస్ జగన్ ధర్నా

Published Wed, Aug 19 2015 8:40 AM | Last Updated on Tue, Sep 3 2019 8:50 PM

25న బందరులో వైఎస్ జగన్ ధర్నా - Sakshi

25న బందరులో వైఎస్ జగన్ ధర్నా

మచిలీపట్నం : వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 25వ తేదీన మచిలీపట్నంలో ధర్నా నిర్వహించనున్నారు. ఆ  విషయాన్ని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్తమాజేరులో విషజ్వరాల బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఎలాంటి సాయం అందించకపోవటంతో బాధితుల తరఫున ఒత్తిడి తెచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఈ ధర్నా తలపెట్టారని వివరించారు.

 చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి 18 మంది మృతి చెందారని... మృతుల కుటుంబాలను ఈ నెల నాలుగో తేదీన కొత్తమాజేరులో పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. లేకుంటే మృతుల కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారని తెలిపారు. కొత్త మాజేరు మృతుల కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement