సాక్షి, కృష్ణా జిల్లా: డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి? అంటూ పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా?. మీ ఉడత ఊపులకు మేం భయపడబోం’’ అని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపైనా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘సినిమాల్లో నాలుగు డ్యాన్స్‌లు వేసి రాజకీయాల్లోకి వచ్చావ్. నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావ్. కులం లేదు, మతం లేదంటూ మతాలను రెచ్చగొడతావ్. క్రిస్టియన్లకు, ముస్లింలకు ఉన్న ఐక్యత మీకు లేదా అంటూ హిందువులను రెచ్చగొడతావ్. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టావ్. ఈ రోజు మతాలను రెచ్చగొడుతున్నావ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి. .బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలినతనం’’ అంటూ పేర్ని నాని నిప్పలు చెరిగారు.
‘‘గుడివాడ వెళితే నా కారుపై రాళ్లు వేయించావ్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని గుర్తుంచుకో పవన్. మచిలీపట్నం పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా. తప్పుడు ఉద్యోగం చేయడం మీరు మొదలుపెడితే హింసా రాజకీయాలు మొదలవుతాయి. మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. మందు పోయించి మా ఇళ్ల పైకి మందిని పంపిస్తే. పరిస్థితులు మరోలా ఉంటాయి’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు.
‘‘పవన్ తప్పుడు రాజకీయాలు మానుకోవాలి. నిన్నటి దాకా కులం అయిపోయింది. ఇప్పుడు కాషాయ దుస్తులు ధరించావ్. కాషాయ దుస్తులు తీసేసి.. సినిమాల్లో అమ్మాయిలతో డాన్స్‌లు చేసి రావడమేంటి?. లడ్డూలో నిజంగానే తప్పులుంటే ఈ డ్రామాలెందుకు?. తప్పుడు రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టి పాపం మూటగట్టుకుంటున్నారు. దిష్టిబొమ్మ తగలేసి. శునకానందం పొందడం మానుకో. హుందాగా రాజకీయం చేయండి. పోతు పేరంటాళ్లలాగా మెట్లకు పసుపులు రాయడం కాదు’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం.. ఏది నిజం?
వైజాగ్ స్టీల్ కార్మికులతో ఏం చెప్పావో మర్చిపోయావా?. ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్‌ను బద్ధలు కొట్టేస్తా అన్నావ్. చంద్రబాబు, నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ కాపాడతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా. మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నేను గెలిచిన 24 గంటల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నావ్. వంద రోజులైంది. ఏమైంది సుగాలి ప్రీతి కేసు. ఎన్నికల ముందు 30 వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారన్నావ్ కదా. డిప్యూటీ సీఎం అయ్యావు.. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఏమైపోయాయి. నా కారు పై రాళ్లేయించినా.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయించినా తగ్గేదే లేదు.. ఆగేదే లేదు. నీకు చేతనైతే.. నికార్సైన రాజకీయ నాయకుడివైతే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు’’ అని పేర్ని నాని హితవు పలికారు.
‘‘బందరు పోర్టు, మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారు. ఇలాంటి పాపాలు చేయడం మానుకోండి. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని నువ్వూ... నీ ముఖ్యమంత్రి చెబుతారు. లోకేష్.. నీ ఆర్థిక మంత్రి నెయ్యి కలపలేదంటారు. దేవుడితో దుర్మార్గమైన నీచ రాజకీయాలు మాని.. ప్రజలకు మంచి చేయండి’’ అని పేర్ని నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment