Medical Education Closer To Poor Students - Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు చేరువగా వైద్య విద్య 

Published Sat, Jul 29 2023 4:31 AM | Last Updated on Sat, Jul 29 2023 5:15 PM

medical education closer to poor students - Sakshi

కోనేరుసెంటర్‌: మచిలీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణం చరిత్రాత్మకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మెడికల్‌ కళాశాలను శుక్రవారం ఆమె స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో 64 ఎకరాల విస్తీర్ణంలో రూ.560 కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించడం అభినందనీయమన్నారు.

ఇందుకోసం దాదాపు రూ.8,500 కోట్లు వెచ్చించి.. త్వరలోనే 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలన్న సంకల్పంతో మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టిన  సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఐదు మెడికల్‌ కళాశాలల్లో సెప్టెంబర్‌ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్‌ కళాశాలల్లోనూ, ఆపై ఏడాది మిగిలిన ఏడు మెడికల్‌ కళాశాలల్లోనూ అకడమిక్‌ ఇయర్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కళాశాలను కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. కనీసం ఆస్పత్రులనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ శూన్యమన్నారు. ఆస్పత్రుల్లో మందులనైనా ప్రజలకు అందుబాటులోకి తెద్దామన్న ఆలోచన కూడా చేయని చంద్రబాబు.. సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వైద్య రంగానికి సంబంధించి దాదాపు 50,000 ఉద్యోగాలిచి్చన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. మరో 3,000 పోస్టులకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు చెప్పారు.

రైతులపై చంద్ర­­బాబుది మొసలికన్నీరేనని ధ్వజమెత్తారు. రైతును రారాజుగా చూస్తోంది, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్‌ ప్రభుత్వమేనన్న విషయాన్ని చంద్రబాబు తెలుసు­కోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు, వైఎసార్‌సీపీ యువజన విభాగం జోనల్‌ ఇన్‌చార్జ్‌ పేర్ని కిట్టు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement