
బందరులో ధర్నా చేపట్టిన వైఎస్ జగన్
మచిలీపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్తమాజేరులో విష జ్వరాల బారినపడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు.
ఇప్పటివరకూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ ఈ ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ధర్నా అనంతరం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.