
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ భూ సంసక్కరణ విభాగం అధికారి ప్రశాంతి ఎసీపీ అధికారులకు పట్టుపడింది. తాడేపల్లికి చెందిన రామలింగేశ్వర రెడ్డికి నాలుగు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన పట్టదారు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు రైతు నుంచి రూ. 6 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో బాధిత వ్యక్తి నుంచి రూ. 6 లక్షలు తీసుకుంటూ ప్రశాంతి అధికారులకు చిక్కింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు కలెక్టరేట్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment