
భూ సేకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ధర్నా
హైదరాబాద్ : ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులు పాటు ధర్నా చేయనున్నారు. కృష్ణాజిల్లా కొత్తమాజేరు విషజ్వర బాధితులను ప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ఆయన ఈనెల 25న మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ మరుసటి రోజు (ఆగస్ట్ 26న) రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ధర్నా చేస్తారు.