తాడేపల్లి (గుంటూరు జిల్లా) : రాజధాని ప్రాంతంలో భూములను కోల్పోతున్న రైతులు అరటి పీకలతో ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీపై అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వరంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సహాయ కార్యదర్శి బాబురావు, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు పంటలు పండే జరీబు భూములను సేకరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. భూసేకరణ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున బైఠాయించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కాగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లినట్లు సమాచారం.
రాజధాని రైతుల ధర్నా
Published Sun, Aug 23 2015 10:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement