
విషజ్వర బాధితుల కోసం వైఎస్ జగన్ ధర్నా
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ధర్నా చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్ ముందు వైఎస్ జగన్ ధర్నా చేస్తారని వైఎస్సార్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. కృష్ణా జిల్లా కొత్త మాజేరులో విషజ్వరాల బాధితుల్ని రాష్ట్రప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ఆయన ఆందోళన చేపడుతున్నారని చెప్పారు.
పేద రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధాని కోసం వారినుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఎల్లుండి వైఎస్ జగన్ ధర్నా చేయనున్నారని చెప్పారు.