సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా జిల్లాకు రూ. 6.64కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ బి.శ్రీధర్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, చిన్న నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. మండలాల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. చిన్న నీటిపారుదల కింద రూ.4.38కోట్లు, పంచాయతీరాజ్ పనులకు రూ.1.32కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ. 92.86లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. కేటాయించిన వర్గాలకే ఈ నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిధుల వినియోగంలో దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి ల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిమిత్తం ప్రతి మండలానికి రూ.5వేల చొప్పున నిధులు మంజూరయ్యాయన్నారు. ఈనెల 9న అన్ని మండల కేంద్రాల్లో మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. 10న జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చిలుకూరులోని మహిళా ప్రాంగణంలో జిల్లాస్థాయి ఉత్సవాలు చేపట్టాలన్నారు. ఉత్సవాల్లో గ్రామ, మండల సమాఖ్యలు, యువజన సంఘాలు, అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయాలన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాకు ఉప ప్రణాళిక నిధులు రూ.6.64కోట్లు
Published Wed, Oct 9 2013 1:00 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement