- కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు ప్రారంభం
వీఆర్‌ఏల సమ్మెబాట
Published Thu, Sep 1 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ముకరంపుర: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలకు దిగారు. తెలంగాణ వీఆర్‌ఏ అసోసియేషన్ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవ్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా 2012, 2014లో నియామకమైన వీఆర్‌ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎన్నోమార్లు విన్నవించినా ఫలితం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు పెరిగాయని, కాంట్రాక్ ్ట ఉద్యోగులను రెగ్యులర్ చేశారని తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడిన వీఆర్‌ఏలను రెగ్యులర్ చేసి పేస్కేలు వర్తింపజేయాలన్నారు. 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి పదోన్నతి కల్పించాలన్నారు. దీక్షలను కాటారం జెడ్పీటీసీ చల్ల నారాయణ సందర్శించి సంఘీభావం తెలుపారు. వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గోపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఆనంద్‌కుమార్, రవి, తిరుపతి, సజిత్‌రెడ్డి, సంకీర్తన, కోశాధికారి నరేందర్‌రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement