రగులుతున్న ఉద్యమం
Published Wed, Sep 25 2013 12:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమం రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతూ ఉప్పెనను తలపిస్తోంది. విభజనపై కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ సమైక్యాగ్నికి ఆజ్యం పోస్తుండడంతో సమైక్యవాదులు మరింతగా రగిలిపోతున్నారు. జూలై 30వ తేదీ నుంచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా విభజన ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు నిరసనగా ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థి, ప్రజాసంఘాలు చర్యలు చేపట్టాయి.
ట్రెజరీకి సంబంధించి అటెం డర్ మొదలు సబ్‌ట్రెజరీ అధికారుల వరకు సమ్మె లో ఉన్నారు. ఇంతవరకు ఏటీఓలు, ఉపసంచాల కులు విధుల్లో ఉండటం వల్ల ఆగస్టు నెలకు సం బంధించి పోలీసు, న్యాయశాఖ యంత్రాంగానికి జీతాలు అందించగలిగారు. సోమవారం నుంచి వీరు కూడా సమ్మెలోకి వెళ్లి అత్యవసర బిల్లులను సైతం నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా పోలీసు, న్యాయ శాఖ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు అందే పరిస్థితి దాదాపు లేదు. అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర బిల్లులు కూడా చేసే ప్రసక్తే లేదని జిల్లా ట్రెజరీ డీడీ సుధాకర్ తెలిపారు.
రైతుల పాత్ర పెరిగింది.. : మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల సమ్మె వల్ల ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు గత నెల 13 నుంచి సమ్మె చేస్తున్నా ఇబ్బంది పడని రైతులు మార్కెటింగ్ ఉద్యోగుల సమ్మెతో రోడ్డుపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. మార్కెట్‌బంద్ కావడంతో కూరగాయలు హోల్‌సేల్, రీటైల్ అమ్మకాలు రోడ్డుపైనే జరుగుతుండటంతో ప్రతిరోజూ ఆరేడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ నెల 20వ తేదీ రాత్రి సి.బెళగల్ మండలం పులకుర్తి, బోదెపాడు గ్రామాలకు చెందిన రైతులు ఐదారు లారీల ఉల్లిని తీసుకువచ్చి బలవంతంగా మార్కెట్‌లోకి వెళ్లి జంబోషెడ్‌లో పోసుకున్నారు. సమ్మె కారణంగా కొనడానికి ఎవ్వరూ సహకరించకపోవడంతో రైతు లు మార్కెట్‌లోనే ఉండిపోయారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి జోక్యం చేసుకుని రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉల్లిని కొనాలని సూచించినా ఫలితం లేకపోవడంతో రైతులు ఉల్లిని బయటకు తీసుకెళ్లి అమ్ముకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement