కలెక్టరేట్ సోమవారం ఉదయం ఆందోళనలతో అట్టుడికిపోయింది. భూ, మైనింగ్ మాఫియాకు కొమ్ముకాస్తున్న నర్సీపట్నం ఆర్డీవోను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని ఏపీ గిరిజన సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించకుండా వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) నేతలు, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబునాయుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీని నిలుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
Published Mon, Feb 16 2015 11:54 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM
Advertisement