కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2013-14 సంవత్సరానికి గాను జిల్లాకు కేటాయించిన దీపం కనెక్షన్లను నెలలోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అహ్మద్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ యజమానులు, అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం కన్పించడం లేదని అన్నారు.మొత్తం 23వేల కనెక్షన్లు నెలలోగా మంజూరు చేసి ప్రతిపాదనలు తనకు పంపించాలని ఆదేశించారు.
లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని త్వరలో గ్రౌండింగ్ చేస్తామని అధికారులు తెలిపారు. వచ్చేవారం సమావేశానికి సమగ్ర నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ సూచిం చారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బ్యాంకుమేళాలు నిర్వహించాలని ఆదేశించినా కొన్నిచోట్ల నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో బ్యాంకు మేళా నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తం గా 8 లక్షల ఖాతాలు తెరవడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు మండలాల్లో 53 వేల ఖాతాలు, పట్టణాల్లో 53 వేలు, ఐటీడీఏ పరిధిలో 59,781 బ్యాంక్ ఖాతాలు తెరిచారని అన్నారు. మొత్తంగా లక్షా 65వేల ఖాతాలు తెరిచారని, లక్ష్యాన్ని నెలలో సాధించాలని తెలిపారు.
17, 18వ తేదీల్లో కొన్ని మండలాల్లో మేళా నిర్వహించలేదని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతా తెరవడంలో అధికారులు విఫలమవుతున్నారని కలెక్టర్ అన్నారు. ఆర్డీవోలందరూ బ్యాంక్‌మేళాలు, మండలాల వారీగా ప్రతి రోజు సాయంత్రం ఖాతాలు తెరిచిన వివరాలు సేకరించాలని, మేళా నిర్వహించకపోతే తనకు గానీ, సంబంధిత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి గానీ సమాచారం అం దించాలని ఫోన్లో ఆర్డీవోలను ఆదేశించారు. శని వారం ఎన్ని ఖాతాలు తెరిచారో అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రలు ఉన్న వారి ఖాతాలు తెరవడం లేదని, సంతకం చేసిన వారి ఖాతాలే తెరుస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సీరియస్‌గా తీసుకోవాలని అందరికీ ఖాతాలు తెరిచేట్లు చూడాలని కలెక్టర్ తెలిపారు. 3,36,310 గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఇప్పటివరకు 2,53,752 కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. డీఎస్‌వో వసంత్‌రావు దేశ్‌పాండే, మెప్మా పీడీ రాజేశ్వర్, డీఎంహెచ్‌వో స్వామి పాల్గొన్నారు.
దీపం కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాలి
Published Sun, Oct 20 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement