Deepam connections
-
జిల్లాకు 67 వేల కొత్త దీపం కనెక్షన్లు
కడప సెవెన్‌రోడ్స్ : దీపం కనెక్షన్ల లక్ష్యాలను త్వరగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి విజయరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో లక్షా 13 వేల దీపం కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాలన్నది లక్ష్యం కాగా సీఎస్ఆర్, దీపం కింద ఇప్పటివరకు 75 వేల కనెక్షన్ల గ్రౌండింగ్ జరిగిందని పేర్కొన్నారు. మిగతా వాటిని కూడా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఇవి కాకుండా జిల్లాకు కొత్తగా 67 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయని, వాటినికూడా కేటాయిస్తామని తెలిపారు. కొత్త డీలర్లను ప్రోత్సహించేందుకు వీలుగా దీపం కనెక్షన్లు కేటాయిస్తామన్నారు. వినియోగదారుల నెంబర్లను దీపం వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. సాంకేతిక పరమైన సమస్యలను సాకుగా చూపరాదన్నారు. ఆధార్‌నెంబరు ఉంటేనే కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చాలంటే దీపం కనెక్షన్లు విరివిగా గ్రౌండ్ చేయాలన్నారు. ఎఫ్పీ షాపు డీలర్లకు దీపం కనెక్షన్ల టార్గెట్ ఇవ్వబోమని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతినెల 1 నుంచి 15వ తేది వరకు డీలర్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. గ్యాస్ కనెక్షన్లు లేని కార్డుదారులు ఎఫ్పీ షాపుకు వచ్చినపుడు డీలర్లు వారిని ఏజెన్సీల వద్దకు పంపే బాధ్యతను మాత్రమే అప్పగిస్తామన్నారు. ఎల్పీజీ డీలర్లే దీపం కనెక్షన్ల గురించి కరపత్రాలు, ఇతర రకాలుగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. డెలివరి బాయ్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు తరుచూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ ఛార్జీలు వసూలు చేయకుండా నివారించాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓలు శ్రీనివాసులు, నాగార్జునరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ కార్డులు ఏరివేస్తాం: పరిటాల సునీత
అనంతపురం: ఈ నెలాఖరులోగా 13 జిల్లాల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులను ఏరివేస్తామన్నారు. 8 లక్షల రేషన్ కార్డులు ఇంకా ఆధార్‌తో అనుసంధానం కాలేదని చెప్పారు. కొత్తగా 12 లక్షల కార్డులు ఇస్తామని తెలిపారు. వచ్చే ఆరు మాసాల్లో 20 లక్షల దీపం కనెక్షన్లు పంపిణీ చేస్తామన్నారు. అమరావతిలో రూ.2 కోట్లతో పౌరసరఫరా భవనం నిర్మిస్తామని తెలిపారు. -
దీపం కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2013-14 సంవత్సరానికి గాను జిల్లాకు కేటాయించిన దీపం కనెక్షన్లను నెలలోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అహ్మద్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ యజమానులు, అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం కన్పించడం లేదని అన్నారు.మొత్తం 23వేల కనెక్షన్లు నెలలోగా మంజూరు చేసి ప్రతిపాదనలు తనకు పంపించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని త్వరలో గ్రౌండింగ్ చేస్తామని అధికారులు తెలిపారు. వచ్చేవారం సమావేశానికి సమగ్ర నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ సూచిం చారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బ్యాంకుమేళాలు నిర్వహించాలని ఆదేశించినా కొన్నిచోట్ల నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో బ్యాంకు మేళా నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తం గా 8 లక్షల ఖాతాలు తెరవడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు మండలాల్లో 53 వేల ఖాతాలు, పట్టణాల్లో 53 వేలు, ఐటీడీఏ పరిధిలో 59,781 బ్యాంక్ ఖాతాలు తెరిచారని అన్నారు. మొత్తంగా లక్షా 65వేల ఖాతాలు తెరిచారని, లక్ష్యాన్ని నెలలో సాధించాలని తెలిపారు. 17, 18వ తేదీల్లో కొన్ని మండలాల్లో మేళా నిర్వహించలేదని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతా తెరవడంలో అధికారులు విఫలమవుతున్నారని కలెక్టర్ అన్నారు. ఆర్డీవోలందరూ బ్యాంక్మేళాలు, మండలాల వారీగా ప్రతి రోజు సాయంత్రం ఖాతాలు తెరిచిన వివరాలు సేకరించాలని, మేళా నిర్వహించకపోతే తనకు గానీ, సంబంధిత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి గానీ సమాచారం అం దించాలని ఫోన్లో ఆర్డీవోలను ఆదేశించారు. శని వారం ఎన్ని ఖాతాలు తెరిచారో అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రలు ఉన్న వారి ఖాతాలు తెరవడం లేదని, సంతకం చేసిన వారి ఖాతాలే తెరుస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డీటీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సీరియస్‌గా తీసుకోవాలని అందరికీ ఖాతాలు తెరిచేట్లు చూడాలని కలెక్టర్ తెలిపారు. 3,36,310 గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఇప్పటివరకు 2,53,752 కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, మెప్మా పీడీ రాజేశ్వర్, డీఎంహెచ్‌వో స్వామి పాల్గొన్నారు.